శిరోముండనం కేసు తీర్పుపై తోట త్రిమూర్తులు అప్పీల్‌

దళిత యువకులకు శిరోముండనం చేసి వారి మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.

Published : 23 Apr 2024 04:34 IST

నేడు విచారించనున్న హైకోర్టు

ఈనాడు, అమరావతి: దళిత యువకులకు శిరోముండనం చేసి వారి మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. ఈ కేసులోని దోషులు ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులతోపాటు మరో ఎనిమిది మంది హైకోర్టులో రెండు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై అత్యవసర విచారణ జరపాలని న్యాయవాది వి.సాయికుమార్‌ సోమవారం హైకోర్టును అభ్యర్థించారు. త్రిమూర్తులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయబోతున్నారని తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రవీంద్రబాబు స్పందిస్తూ.. మంగళవారం అప్పీళ్లపై విచారిస్తామని వెల్లడించారు.

1996 డిసెంబర్‌ 29న రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో చోటుచేసుకున్న దళితుల శిరోముండనం కేసులో విశాఖలోని 11వ అదనపు జిల్లా కోర్టు.. తోట త్రిమూర్తులతోపాటు 8మందికి 18నెలల సాధారణ జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఈనెల 16న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని