పాలిసెట్‌- 2024కి 88.74 శాతం మంది హాజరు

పాలిటెక్నిక్‌ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్‌-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

Published : 28 Apr 2024 04:40 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి:  పాలిటెక్నిక్‌ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్‌-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు 1,59,989 మంది నమోదు చేసుకోగా, 1,41,978 మంది పరీక్ష రాసినట్లు ఓ ప్రకటనలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి వెల్లడించారు. ప్రాథమిక ‘కీ’ని ఈ నెల 30న విడుదల చేస్తామన్నారు. ఫలితాలను మే 10లోపు విడుదల చేసి, విద్యా సంవత్సరాన్ని జూన్‌ మొదటి వారంలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు