ప్లాస్టర్‌ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!

సీఎం జగన్‌ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్‌ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్‌తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్‌ లేకుండా కనిపించారు.

Updated : 28 Apr 2024 09:23 IST

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్‌ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్‌తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్‌ లేకుండా కనిపించారు. మరోవైపు విజయవాడ మధ్య నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌ కూడా కట్టు తీసేశారు. అదే రోజు సీఎంతో పాటు తనకూ దెబ్బ తగిలిందంటూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. స్వల్పంగా కంటికి గాయమైనట్టు తెలిపారు. కట్టు మాత్రం చాలా పెద్దగా వేసుకున్నారు. ఆ కట్టును అలాగే ఉంచి పది రోజులు ప్రచారం చేశారు. ఆదివారం వరకూ కంటికి కట్టు ఉంది. సోమవారం అదే కట్టుపై నల్లకళ్లద్దాలు పెట్టారు. మంగళవారం నుంచి కట్టు తీసేసి సేఫ్టీ కళ్లద్దాలను పెట్టారు. తాజాగా శనివారం ఆ కళ్లద్దాలనూ తీసేశారు. మొత్తానికి 15 రోజులకు ‘కట్టు’ కథ పూర్తయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు