విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక

ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌక ‘ది వరల్డ్‌’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు.

Updated : 29 Apr 2024 09:09 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌక ‘ది వరల్డ్‌’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. అందులోని విదేశీయులు స్థానిక కళాకారులతో సంప్రదాయ నృత్యాలు చేశారు. పోర్టు ఛైర్మన్‌ అంగముత్తు మాట్లాడుతూ.. ‘‘విలాసవంతమైన ‘ది వరల్డ్‌’ క్రూయిజ్‌ నౌక విశాఖ పోర్టులోని అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌లో బెర్తింగ్‌ అయ్యింది. తూర్పు తీరంలో అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌకలకు విశాఖపట్నం క్రూయిజ్‌ టెర్మినల్‌ను గమ్యస్థానంగా మారుస్తాం. ఈ టెర్మినల్‌ను రూ.96 కోట్లతో ప్రపంచంలోనే ప్రత్యేకమైన క్రూయిజ్‌ నౌకల రాకపోకలకు అనువుగా నిర్మించాం. ‘ది వరల్డ్‌’ నౌకలో వచ్చిన విదేశీయులకు నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలను చూపిస్తాం’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని