ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు

నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated : 29 Apr 2024 08:47 IST

జూపాడుబంగ్లా, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో శనివారం పూజా కార్యక్రమాలు, హరికథా కాలక్షేపం నిర్వహించారు. వాటిని తిలకించేందుకు వెళ్లిన తనను బయటకెళ్లు అంటూ అవమానించారని బాధితుడు పేర్కొన్నారు. దళితుడిని కావడంతోనే తనను బయటకు వెళ్లమన్నారని వాపోయారు. దళిత సర్పంచిని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని