వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం

వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్‌ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి.

Published : 29 Apr 2024 05:21 IST

కాలిపోయిన జామాయిల్‌ తోటలు.. రూ.10 లక్షల నష్టం

నూజండ్ల, న్యూస్‌టుడే: వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్‌ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. పల్నాడు జిల్లా నూజండ్ల మండలం కంభంపాడులో ఆదివారం ఇది జరిగింది. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కంభంపాడులో ప్రచారం నిర్వహించడానికి రాగా గ్రామ సరిహద్దులో వారికి స్వాగతం పలుకుతూ బాణపంచా పేల్చారు. దీంతో నిప్పురవ్వలు పక్కన ఉన్న చేనులో పడి మంటలు రేగాయి. పశువుల కోసం పెంచుతున్న 20 ఎకరాల్లోని మేత, పొలాల్లో మోటార్లు, విద్యుత్తు వైర్లు కాలిపోయాయి. దగ్గరలో ఉన్న జామాయిల్‌ తోటలకు మంటలు అంటుకోగా పది ఎకరాల్లో పంట కాలిపోయింది. తోట హనుమయ్య, శ్రీను, నీలం చిన అంజయ్య తదితరుల తోటలు కాలిపోయాయి. నష్టం రూ.10లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని