Holidays: నవంబరులో 15 రోజులు బ్యాంకులకు సెలవు!

నవంబరులో బ్యాంకులకు వర్తించే సెలవుల (Holidays) జాబితాను ఆర్బీఐ (RBI) విడుదల చేసింది.

Published : 31 Oct 2023 23:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నవంబరు నెలలో ఉన్న సెలవుల (Holidays) జాబితాను రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) విడుదల చేసింది. నవంబర్‌లో రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, ఇతర పండుగలు కలిపి మొత్తం 15 రోజులు సెలవులు ఉన్నట్లు ఆర్బీఐ క్యాలెండర్‌ పేర్కొంది. సెలవుల జాబితాను ఆర్బీఐ ప్రతి నెలా రూపొందిస్తుంది. నెగొషబుల్‌ ఇన్‌స్ట్రూమెంట్స్‌ యాక్ట్, హాలిడే, రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ హాలిడే అండ్‌ బ్యాంక్స్ క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ అనే మూడు కేటగిరీలను దృష్టిలో ఉంచుకొని ఆ జాబితాను తయారు చేస్తుంది. ఈ క్యాలెండర్‌ ప్రకారం కొన్ని సెలవులు ఆయా ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, బ్యాంకును బట్టి మారుతుంటాయి. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. బ్యాంకులకు వర్తించే సెలవుల జాబితా ఇదే..  

రిలయన్స్‌ ఎస్‌బీఐ భాగస్వామ్యంలో క్రెడిట్‌ కార్డ్‌.. ప్రయోజనాలు ఇవే!

  • నవంబరు 1వ తేదీన కర్ణాటక (కన్నడ రాజ్యోత్సవ), మణిపుర్ (కత్), హిమాచల్‌ప్రదేశ్‌ (కర్వా చౌత్‌) నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో సెలవు ఉంది. 
  • నవంబరు 10వ తేదీన అగర్తల, దెహ్రాదూన్‌, గ్యాంగ్‌టక్‌, ఇంఫాల్‌, కాన్పూర్‌, లఖ్‌నవూ పట్టణాల్లో వంగల ఫెస్టివల్‌ నేపథ్యంలో సెలవు. 
  • నవంబరు 11 నుంచి 14 వరకు వారాంతం, దీపావళి నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో సెలవులు వచ్చాయి. 
  • నవంబరు 15న గ్యాంగ్‌టక్‌, ఇంఫాల్, కాన్పూర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ సహా హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో స్థానిక పండుగల నేపథ్యంలో బ్యాంకులకు సెలవు. 
  • నవంబరు 20న బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఛత్‌ పండుగను నిర్వహిస్తారు. 
  • నవంబరు 23న ఉత్తరాఖండ్‌, మణిపుర్‌ రాష్ట్రాల్లో స్థానిక పండుగలు ఉన్నాయి.
  • నవంబరు 25-27 వరకు వారాంతం, కార్తిక పూర్ణిమ, గురునానక్‌ జయంతి.
  • నవంబరు 30న కనకదాసు జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు పనిచేయవు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని