Reliance SBI Card: రిలయన్స్‌ ఎస్‌బీఐ భాగస్వామ్యంలో క్రెడిట్‌ కార్డ్‌.. ప్రయోజనాలు ఇవే!

Reliance SBI Card features: రిలయన్స్‌ ఎస్‌బీఐ కార్డు భాగస్వామ్యంలో కో బ్రాండ్‌ క్రెడిట్‌కార్డును తీసుకొచ్చారు. రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లలో కొనుగోళ్లపై రివార్డులు లభిస్తాయి.

Updated : 01 Nov 2023 07:43 IST

Reliance SBI Card | ఇంటర్నెట్‌ డెస్క్: ఎస్‌బీఐ కార్డ్‌, రిలయన్స్‌ రిటైల్‌ చేతులు కలిపాయి. రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్‌ పేరిట ఓ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును (Reliance SBI Card) తీసుకొచ్చాయి. ఈ కార్డుతో రిలయన్స్‌ రిటైల్‌కు విస్తృత స్థాయిలో ఉన్న రిటైల్‌ ఔట్‌లెట్లలో కొనుగోళ్లపై రివార్డులను పొందొచ్చు. ఫ్యాషన్‌, లైఫ్‌స్టయిల్‌, గ్రాసరీ, కన్జ్యూమర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫార్మా, ఫర్నీచర్‌, జువెలరీ కొనుగోళ్లపై రివార్డులు లభిస్తాయి. అలాగే ఎస్‌బీఐ ఎప్పటికప్పుడు అందించే ఆఫర్లనూ పొందొచ్చు.

ఈ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు రూపే నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. యూపీఐకి అనుసంధానం చేసుకోవచ్చు. ఈ కార్డు రెండు వేరియంట్లలో వస్తోంది. రిలయన్స్‌ ఎస్‌బీఐ కార్డు, రిలయన్స్‌ ఎస్‌బీఐ కార్డ్‌ ప్రైమ్‌ పేరుతో వీటిని తీసుకొచ్చారు. ఎస్‌బీఐ కార్డు వార్షిక ఫీజు రూ.499 కాగా.. ప్రైమ్‌ కార్డు వార్షిక ఫీజును రూ.2999గా నిర్ణయించారు. ఆయా కార్డులపై రివార్డు పాయింట్లలో తేడా ఉంటుంది. నిర్దేశిత మొత్తం కొనుగోళ్లపై వార్షిక ఫీజులో రాయితీ ఉంటుంది.

రిలయన్స్‌ ఎస్‌బీఐ కార్డు (Reliance SBI Card)

ఈ కార్డుకు జాయినింగ్‌ ఫీజు రూ.499 చెల్లించాలి. జీఎస్టీ అదనం. వెల్‌కమ్‌ బెన్‌ఫిట్‌ కింద రూ.500 విలువ చేసే రిలయన్స్‌ రిటైల్‌ వోచర్‌ను అందిస్తారు. ఏడాదికి రూ.1లక్షపైన కొనుగోళ్లు జరిపితే మరుసటి ఏడాది రెన్యువల్‌ ఫీజు ఉండదు. రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్‌లో కొనుగోళ్లపై ప్రతి రూ.100కు 5 రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఫ్యూయల్‌ సర్‌ఛార్జి లేదు. ట్రెండ్స్‌, అజియో, సెంట్రో, జివామె, అర్బన్‌ లేడర్‌, జియో మార్ట్‌ ద్వారా కొనుగోళ్లపై 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.

రిలయన్స్‌ ఎస్‌బీఐ కార్డ్‌ ప్రైమ్‌ (Reliance SBI Card PRIME)

ఇది ప్రీమియం కార్డు. జాయినింగ్‌ ఫీజు రూ.2999. దీనికి జీఎస్టీ అదనం. వెల్‌కమ్‌ బెన్‌ఫిట్‌ కింద రూ.3000 విలువ చేసే రిలయన్స్‌ రిటైల్‌ వోచర్‌ను ఇస్తారు. ఏడాదిలో రూ.3 లక్షల కంటే ఎక్కువ కొనుగోళ్లపై వార్షిక ఫీజుపై రద్దు చేస్తారు. రిలయన్స్‌ స్టోర్లలో చేసే ప్రతి రూ.100 కొనుగోలుపై 10 రివార్డు పాయింట్లు లభిస్తాయి. బుక్‌మై షోలో ప్రతి నెలా రూ.250 విలువ చేసే మూవీ టికెట్‌ ఫ్రీ. దేశీయ విమానాశ్రయాల్లో ఏడాదిలో 8 లాంజ్‌ యాక్సెస్‌లు ఉంటాయి. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో 4 లాంజ్‌ యాక్సెస్‌లు లభిస్తాయి. 1 రివార్డు పాయింట్‌ = 0.25 పైసలు. మరిన్ని వివరాలకు ఎస్‌బీఐ కార్డ్‌ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని