Nirmala Sitharaman: 2047 నాటికి 41 కోట్ల మంది పన్ను పరిధిలోకి: నిర్మలా సీతారామన్‌

Nirmala Sitharaman: గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2023లో పాల్గొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరణ గురించి ప్రస్తావించారు.

Updated : 05 Sep 2023 20:09 IST

దిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ గణాంకాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి పన్ను స్లాబ్‌లో పన్ను దాఖలు చేసే వారి సంఖ్య కనిష్ఠంగా మూడు రెట్లు పెరిగిందని చెప్పారు. ఐటీఆర్‌ ఫైలింగ్‌లో మహారాష్ట్ర అగ్రగామిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2023 (Global Fintech Fest 2023) ప్రసంగంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ అక్షరాస్యత ప్రాముఖ్యత వంటి అంశాల గురించి ప్రస్తావించారు. 

దేశం స్వాతంత్ర్యం సాధించి నూరేళ్లు పూర్తికానున్న వేళ.. 2047 నాటికి మొత్తం జనాభాలో శ్రామిక శక్తి వాటా 45 శాతానికి పెరుగుతుందని నిర్మాలా సీతారామన్ అన్నారు. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య 22.5 శాతం నుంచి 85.3 శాతానికి చేరుతుందన్నారు. 2023లో 7 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయగా.. 2047 నాటికి ఆ  సంఖ్య 48.2 కోట్లకు పెరుగుతుందని చెప్పారు.

ప్రపంచ కప్‌ క్రికెట్‌ను స్పాన్సర్‌ చేయనున్న మహీంద్రా

డిజిటల్ ఆక్షరాస్యత ప్రాధాన్యం గురించి మాట్లాడుతూ.. చాలా దేశాలు ఈ రంగంలో రాణిస్తున్నప్పటికీ ఇంకా కొన్ని దేశాలు మాత్రం వెనకబడి ఉన్నాయని నిర్మలా సీతారామన్‌ అన్నారు. భారత్‌ మాత్రం ఈ విషయంలో ముందంజలో ఉందన్నారు. డిజిటల్‌ అక్షరాస్యత గ్రామీణ స్థాయికి చేరిందని చెప్పారు. నాలుగు సంవత్సరాల్లో డీమ్యాట్ (DMAT) ఖాతాల సంఖ్య రెండు రెట్లు పెరిగిందన్నారు. 2019లో 4.1 కోట్లుగా ఉన్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2022-23 నాటికి 10 కోట్లకు చేరిందని చెప్పారు. గ్లోబలైజేషన్‌ అనేది పేదరికాన్ని పారదోలడానికి ఉపయోగపడిందని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని