Adani Green: అదానీ గ్రీన్‌ @ 10,000MW.. భారత్‌లో తొలి కంపెనీ

Adani Green: భారత్‌లో 10,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న తొలి పునరుత్పాదక ఇంధన సంస్థగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నిలిచినట్లు ఆ కంపెనీ వెల్లడించింది.

Published : 03 Apr 2024 15:33 IST

దిల్లీ: గుజరాత్‌లోని ఖావ్‌డా సోలార్‌పార్క్‌లో కొత్తగా 2,000 మెగావాట్ల సౌర ఇంధన సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (Adani Green Energy Limited- AGEL) బుధవారం ప్రకటించింది. దీంతో దేశంలో 10వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉన్న తొలి కంపెనీగా నిలిచినట్లు తెలిపింది. మొత్తంగా కంపెనీ నిర్వహణ పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం 10,934 మెగావాట్లకు చేరినట్లు వెల్లడించింది.

తమ నిర్వహణలోని పోర్ట్‌ఫోలియోలో 7,393 మెగావాట్ల సోలార్‌, 1,401 మెగావాట్ల పవన విద్యుత్తు, 2,140 మెగావాట్ల పవన-సౌర హైబ్రిడ్‌ విద్యుత్తు సామర్థ్యం ఉన్నట్లు అదానీ గ్రీన్‌ తెలిపింది. 2030 నాటికి 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. తమ 10,934 మెగావాట్ల సామర్థ్యంతో 58 లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా అవుతుందని తెలిపింది. ఏటా 2.1 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించొచ్చని పేర్కొంది.

స్వచ్ఛ ఇంధన కలలను అదానీ గ్రీన్ ఎనర్జీ (AGEL) పదేళ్లలోనే నిజం చేసిందని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్ అదానీ (Gautam Adani) అన్నారు. 2030 నాటికి 45 గిగావాట్ల సామర్థ్యాన్ని చేరుకోవడంలో భాగంగా ఖావ్‌డాలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. 538 చదరపు కిలోమీటర్ల స్థలంలో నిర్మిస్తున్న ఈ ప్లాంటు విస్తీర్ణంపరంగా ముంబయికి సమానంగా, ప్యారిస్‌ కంటే ఐదింతలు పెద్దది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు