Adani Ports: విప్రో ఔట్‌.. అదానీ పోర్ట్స్‌ ఇన్‌.. సెన్సెక్స్‌లోకి అదానీ గ్రూప్‌ సంస్థ

Adani Ports to join Sensex: సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ గ్రూప్‌ వచ్చి చేరనుంది. విప్రో ఈ జాబితా నుంచి వైదొలగనుంది.

Updated : 24 May 2024 18:27 IST

దిల్లీ: గౌతమ్‌ అదానీ గ్రూప్‌నకు చెందిన కంపెనీల్లో ఒకటైన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (Adani Ports and Special Economic Zone) సెన్సెక్స్‌లోకి అడుగుపెట్టనుంది. ఐటీ సంస్థ అయిన విప్రో ఈ జాబితా నుంచి వైదొలగనుంది. జూన్‌ 24 నుంచి కొత్త మార్పు అమల్లోకి రానుంది. ఎస్‌అండ్‌పీ డౌజోనస్‌ సూచీ, బీఎస్‌ఈ జాయింట్‌ వెంచర్‌ అయిన ఆసియా ఇండెక్స్‌ ఈ మార్పును ప్రకటించింది. అలాగే సెన్సెక్స్‌ 50 సూచీలో టాటా గ్రూప్‌కు చెందిన ట్రెంట్‌ లిమిటెడ్‌ చోటు దక్కించుకోగా.. ఈ జాబితా నుంచి ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్‌ లేబొరేటరీస్‌ చోటు కోల్పోయింది.

వాస్తవానికి అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సెన్సెక్స్‌ 30 సూచీలోకి వస్తుందని అంచనా వేశారు. అనూహ్యంగా అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌కు ఆ అవకాశం దక్కింది. గత ఏడాదిగా ఈ కంపెనీ షేర్లు స్థిరంగా రాణిస్తుండడమే ఇందుకు నేపథ్యం. ఏడాదిలో ఈ కంపెనీ షేర్లు 97 శాతం రిటర్నులు ఇవ్వగా.. విప్రో 16 శాతం మాత్రమే ప్రతిఫలం ఇచ్చింది. అదానీ గ్రూప్‌ కంపెనీల్లో సెన్సెక్స్‌ 30 సూచీలో చోటు దక్కించుకున్న తొలి కంపెనీ అదానీ పోర్ట్స్‌ కావడం గమనార్హం. నిఫ్టీ 50లో అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ ఉన్నాయి.

16 నెలల్లో మూడింతలు.. ‘హిండెన్‌బర్గ్‌’ తర్వాత మళ్లీ ఆ స్థాయికి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌

  • స్టాక్‌ 100లో ఆర్‌ఈసీ, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, కెనరా బ్యాంక్‌, కమిన్స్‌ ఇండియా, పీఎన్‌బీ చోటు దక్కించుకోగా.. పేజ్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ కార్డ్స్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, జూబ్లియెంట్‌ ఫుడ్‌వర్క్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు ఈ లిస్ట్‌ నుంచి వైదొలగనున్నాయి. 
  • బీఎస్‌ఈ బ్యాంక్‌ఎక్స్‌లో యెస్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌ చోటు దక్కించుకోగా.. ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ తమ స్థానాలు కోల్పోయాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు