Airtel plans: ఎయిర్‌టెల్‌ ఇన్‌-ఫ్లైట్‌ ప్యాక్స్‌.. రూ.195 నుంచి ప్రారంభం

ఎయిర్‌టెల్‌ ఇన్‌-ఫ్లైట్‌ ప్యాక్స్‌ను తీసుకొచ్చింది. రూ.195 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయి. డేటా, కాలింగ్, ఎస్సెమ్మెస్‌ సదుపాయం ఉంటుంది.

Published : 22 Feb 2024 22:26 IST

Airtel | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ ఎయిర్‌టెల్‌ (Airtel) విమాన ప్రయాణికుల కోసం కొత్త ప్యాక్‌లను తీసుకొచ్చింది. విమానంలో ప్రయాణించేటప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు వీలుగా ఇన్‌-ఫ్లైట్‌ రోమింగ్‌ ప్లాన్లను (in-flight roaming packs) ప్రకటించింది. ఈ ప్లాన్‌ ధరలు రూ.195 నుంచి ప్రారంభమవుతాయి. వీటితో రీఛార్జి చేసుకుంటే డేటాతో వినియోగించడంతో పాటు కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులు ఈ ప్లాన్స్‌ను వినియోగించుకోవచ్చు.

  • ప్లాన్‌ 195: ఈ ప్యాక్‌తో 250 ఎంబీ డేటా, 100 నిమిషాలతో పాటు అవుట్‌ గోయింగ్ కాల్స్‌ చేసుకోవచ్చు. 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 24 గంటలు. ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదారులకు ఇవే సదుపాయాలు ఉంటాయి.
  • ప్లాన్‌ 295: ఈ ప్లాన్‌లో 500 ఎంబీ డేటా లభిస్తుంది. 100 నిమిషాలు అవుట్‌  గోయింగ్‌ కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లు పొందొచ్చు. ఈ ప్లాన్‌ కూడా 24 గంటల కాలవ్యవధితో వస్తోంది.
  • ప్లాన్‌ 595: ఈ ప్లాన్‌ కింద 1జీబీ డేటా లభిస్తుంది. 100 నిమిషాల అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యవధి కూడా 24 గంటలే. 

అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌, ఎస్సెమ్మెస్‌లు, కాలపరిమితి విషయంలో దాదాపు అన్ని ప్లాన్లు ఒకే తరహాలో ఉన్నాయి. డేటా అధికంగా కావాలనుకున్న వారు అధిక విలువ కలిగిన ప్యాక్‌లను వేసుకోవాల్సి ఉంటుంది. 19 విమాన సంస్థల్లో ఇన్‌-ఫ్లైట్‌ కనెక్టివిటీ కోసం ఎరోమొబైల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. విమాన ప్రయాణికుల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే కాంటాక్ట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం 99100-99100 ప్రత్యేకంగా వాట్సాప్‌ నంబర్‌ను కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని