IPO: దశాబ్దం తర్వాత ఎయిర్‌టెల్‌ గ్రూప్‌ నుంచి మరో ఐపీఓ

IPO: భారతీ ఎయిర్‌టెల్‌ నుంచి దశాబ్దం తర్వాత మరో ఐపీఓ వస్తోంది. ఏప్రిల్‌ తొలివారంలో ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Published : 20 Mar 2024 19:42 IST

Bharti Hexacom IPO | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ అనుబంధ భారతీ హెక్సాకామ్‌ (Bharti Hexacom) పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమైంది. ఐపీఓ ద్వారా రూ.4,300 కోట్లు సమీకరించబోతోంది. సెబీ నుంచి ఇప్పటికే ఆమోదం పొందిన ఈ సంస్థ.. ఏప్రిల్‌ మొదటివారంలో ఈ ఐపీఓ తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 

దశాబ్దం తర్వాత భారతీ గ్రూప్‌ నుంచి వస్తున్న ఐపీఓ ఇదీ. ఎంతోకాలంగా ఐపీఓకు రావాలని చూస్తున్న హెక్సాకామ్‌.. మార్చి 19న మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి ఆమోదం పొందింది. హెక్సాకామ్‌లో ఎయిర్‌టెల్‌కు 70 శాతం వాటా ఉండగా.. భారత ప్రభుత్వానికి 30 శాతం వాటా ఉంది. ఐపీఓలో భాగంగా ప్రభుత్వం కొంత వాటా విక్రయించనుంది. భారతీ గ్రూప్ నుంచి చివరగా 2012లో భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఐపీఓ వచ్చింది. ప్రస్తుతం దాన్ని ఇండస్ టవర్స్‌గా పిలుస్తున్నారు. ఆ తర్వాత ఆ గ్రూప్‌ నుంచి వస్తున్న ఐపీఓ ఇదే.

త్వరలో వాట్సప్‌ స్టేటస్‌లో నిమిషం వీడియో!

రాజస్థాన్‌తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోని యూజర్లకు ఎయిర్‌టెల్ బ్రాండ్ కింద మొబైల్ సేవలు, ఫిక్స్‌డ్‌ లైన్ టెలిఫోన్, బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని హెక్సాకామ్‌ అందిస్తోంది. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, బీఓబీ క్యాపిట్‌ మార్కెట్స్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఈ ఐపీఓకి బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లు వ్యవహరించన్నాయి. హెక్సాకామ్‌ 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభం రూ.1,951.1 కోట్లగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో నికర లాభంలో 67.2 శాతం క్షీణించి రూ.549.2 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 21.7 శాతం పెరిగి రూ.6,579 కోట్లుగా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని