WhatsApp: త్వరలో వాట్సప్‌ స్టేటస్‌లో నిమిషం వీడియో!

WhatsApp: వాట్సప్‌లో ప్రస్తుతానికి 30 సెకన్ల వీడియోను మాత్రమే అప్‌లోడ్‌ చేయగలం. సుదీర్ఘ నిడివి గల వీడియోలను సైతం పోస్ట్‌ చేసేందుకు త్వరలో ఈ సామాజిక మాధ్యమం అవకాశం ఇవ్వనుంది.

Published : 20 Mar 2024 12:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సప్‌ స్టేటస్‌లో ప్రస్తుతం గరిష్ఠంగా 30 సెకన్ల నిడివి గల వీడియోలను మాత్రమే పోస్ట్‌ చేసేందుకు అవకాశం ఉంది. అంతకంటే పెద్ద వీడియోలను అప్‌లోడ్‌ చేయాలంటే మరో స్టేటస్ అప్‌డేట్‌ తప్పదు. అలా వీడియో నిడివి పెరుగుతున్న కొద్దీ స్టేటస్‌ అప్‌డేట్ల సంఖ్య పెరుగుతూ పోతుంది. దీన్ని పరిష్కరించేందుకు వాట్సప్‌ సిద్ధమైంది!

ఇకపై 60 సెకన్ల నిడివితో ఉన్న వీడియోలను సైతం స్టేటస్‌లో అప్‌లోడ్‌ చేసే అవకాశాన్ని వాట్సప్‌ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వాబీటా వెల్లడించింది. బీటా వెర్షన్‌ 2.24.7.3 డౌన్‌లోడ్‌ చేసుకున్నవారికి ఈ ఫీచర్‌ దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. త్వరలో మిగిలిన యూజర్లందరికీ ఇది అందుబాటులోకి రానుంది.

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌తో నాయిస్‌ జట్టు..స్మార్ట్‌వాచ్‌తోనే పేమెంట్స్

మరోవైపు పేమెంట్స్‌ను సైతం వాట్సప్‌ మరింత సులభతరం చేస్తోంది. ప్రస్తుతం వాట్సప్‌లో చెల్లింపులు చేయాలంటే త్రీ డాట్స్‌ మెనూలో పేమెంట్స్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం లేకుండా మనం ఎంచుకున్న కాంటాక్ట్‌ చాట్‌లోనే పై భాగంలో క్యూఆర్‌ కోడ్‌ సింబల్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేసి పేమెంట్‌ చేయొచ్చు. ఇది కూడా ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని