Airtel: ఎయిర్‌టెల్‌లో 2 ప్రీపెయిడ్‌ ప్లాన్ల ధర పెంపు

Airtel: ఎలాంటి ప్రకటన లేకుండానే ఎయిర్‌టెల్‌ రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్ల ధరలను పెంచింది. ఒక్కో యూజర్‌పై వచ్చే ఆదాయాన్ని పెంచుకోవటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Published : 11 Mar 2024 11:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దేశీయ టెలికాం సంస్థ భారత ఎయిర్‌టెల్‌ రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్ల (Airtel Prepaid Plans) ధరలను పెంచింది. ఒక్కో యూజర్‌పై వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవటంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.118, రూ.289 ప్లాన్ల ధరలు ఇప్పుడు వరుసగా రూ.129, రూ.329కి చేరాయి. ఈ మేరకు ఎయిర్‌టెల్‌ వెబ్‌సైటు, మొబైల్‌ యాప్‌లో మార్పులు చేశారు.

రూ.129 ప్లాన్‌..

ఎయిర్‌టెల్‌ రూ.129 ప్లాన్‌ ఓ డేటా వోచర్‌. 12 జీబీ డేటా లభిస్తుంది. దీని కాలపరిమితి బేస్‌ ప్లాన్‌ గడువుతో ముగుస్తుంది. కావాలంటే ఒక్క రోజులోనైనా ఈ డేటా మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంతకు మించి ఈ ప్లాన్‌లో ఇతర ప్రయోజనాలేమీ లేవు. ధరలు పెంచటంతో ఒక్కో జీబీపై వెచ్చించే మొత్తం రూ.9.83 నుంచి రూ.10.75కు చేరింది.

రూ.329 ప్లాన్‌..

గతంలో ఈ ప్లాన్‌ ధర రూ.289. దీని వ్యాలిడిటీ 35 రోజులు. 4జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, 300 ఎసెమ్మెస్‌లు వస్తాయి. ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండానే అపోలో 24/7 సర్కిల్‌ సబ్‌స్క్రిప్షన్‌, ఉచిత హలోట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌ వంటి ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ ప్రయోజనాలు లభిస్తాయి. తాజా ధర సవరణతో ఒక్కో రోజు ఈ ప్లాన్‌పై వెచ్చించే మొత్తం రూ.8.25 నుంచి రూ.9.4కు చేరింది. డేటా విరివిగా అవసరం ఉండేవారికి ఈ ప్లాన్‌ సరిపోదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు