Airtel: ఈ ప్లాన్‌ వ్యాలిడిటీని పెంచిన ఎయిర్‌టెల్‌

Airtel: భారతీ ఎయిర్‌టెల్‌ కొత్తగా తీసుకొచ్చిన రీఛార్జి ప్లాన్‌ గడువును పెంచింది. 

Published : 10 Jun 2024 00:04 IST

Airtel | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) ఇటీవల తీసుకొచ్చిన రూ.395 ప్లాన్‌ కాలపరిమితిని పెంచింది. ఇప్పటివరకు ఈ ప్లాన్‌ రీఛార్జితో కేవలం 56 రోజుల వ్యాలిడిటీ లభించేంది. ఇప్పుడు అది 70 రోజులకు చేర్చింది. అంటే ఇకపై కస్టమర్లకు అవే ప్రయోజనాలు మరో 14 రోజులు అదనంగా లభించనున్నాయన్నమాట. ఈ ప్లాన్‌ కింద 6 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాల్స్‌, 70 రోజులకు 600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అపోలో 24|7 సర్కిల్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ అదనపు ప్రయోజనాలు పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని