Airtel Recharge Plans: టీ20 వరల్డ్‌ కప్‌.. ఎయిర్‌టెల్‌లో డిస్నీ+ హాట్‌స్టార్‌ కొత్త ప్లాన్లు

Airtel Recharge Plans: టీ20 వరల్డ్‌ కప్ ను దృష్టిలోఉంచుకొని ఎయిర్‌టెల్‌ కొత్త రీఛార్జ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌, ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ ఇలా మూడు మాధ్యమాల కస్టమర్లకు డిస్నీ+ హాట్‌స్టార్‌తో కూడిన ప్లాన్లను అందుబాటులో ఉంచింది.

Published : 07 Jun 2024 15:55 IST

Airtel Recharge Plans | ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ కొత్త రీఛార్జ్ ప్లాన్లను (Airtel Recharge Plans) తీసుకొచ్చింది. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌తో పాటు ఎక్స్‌ట్రీమ్ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్ల కోసం వీటిని ప్రవేశపెట్టింది. డిస్నీ+ హాట్‌స్టార్‌తో (Disney+ Hotstar) కూడిన ఈ ప్లాన్లు క్రికెట్‌ వీక్షించేవారిని దృష్టిలోఉంచుకొని రూపొందించినట్లు టెలికాం నిపుణులు తెలిపారు. అలాగే వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో అమెరికా, కెనడాకు ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా రోమింగ్‌ ప్లాన్లను కూడా తీసుకొచ్చింది.

ప్రీపెయిడ్‌ ప్లాన్లు..

ప్రీపెయిడ్‌ కస్టమర్లకు డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్లాన్లు రూ.499తో ప్రారంభమవుతున్నాయి. వివిధ కాలపరిమితులు, డేటా లిమిట్స్‌తో మూడు ప్లాన్లను అందిస్తోంది. వీటిలో రూ.3,359 అత్యంత ఖరీదైనది. దీంట్లో ఏడాది సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఓటీటీ ప్రయోజనాలున్నాయి. అదనంగా ఎలాంటి రుసుము లేకుండానే ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ద్వారా మరో 20 ఓటీటీలను ఎంజాయ్‌ చేయొచ్చు.

  • రూ.499 ప్లాన్‌: 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 3జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, మూడు నెలల కాలపరిమితితో డిస్నీ+ హాట్‌స్టార్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌, అపోలో 24/7
  • రూ.869 ప్లాన్‌: 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, మూడు నెలల కాలపరిమితితో డిస్నీ+ హాట్‌స్టార్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌, అపోలో 24/7
  • రూ.3,359 ప్లాన్‌: 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2.5జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, ఏడాది కాలపరిమితితో డిస్నీ+ హాట్‌స్టార్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌లో ఎంపిక చేసుకున్న ఒక ఓటీటీ, అపోలో 24/7

పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లు..

ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లలో డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాది వరకు ఉంటుంది. మూడు నెలల ఎక్స్‌ట్రీమ్‌ ప్లే కూడా లభిస్తుంది. ఈ ప్లాన్లు 499తో ప్రారంభమవుతున్నాయి. బేసిక్‌ ప్లాన్‌లో ఎలాంటి యాడ్‌-ఆన్‌లు లేకుండా 75జీబీ డేటా లభిస్తుంది.

రూ.1,499 ప్లాన్‌లో 200 జీబీ, 4 యాడ్‌-ఆన్‌లు; రూ.1,199లో 150 జీబీ, 3 యాడ్‌-ఆన్‌లు; రూ.999లో 100జీబీ, 3 యాడ్‌-ఆన్‌లు; రూ.599లో 75జీబీ, ఒక యాడ్‌-ఆన్‌; రూ.499లో 75జీబీ; రూ.399లో 40జీబీ డేటా లభిస్తుంది. ఒక్కో యాడ్‌-ఆన్‌తో 30జీబీ డేటా అదనంగా లభిస్తుంది. వీటన్నింటిలో ఏడాది కాలపరిమితితో డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది. అలాగే ఎక్స్‌ట్రీమ్‌ ప్లాన్‌ను సైతం ఆనందించొచ్చు.

ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ ప్లాన్లు..

డిస్నీ+ హాట్‌స్టార్‌తో కూడిన ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ ప్లాన్లు రూ.699 నుంచి ప్రారంభమవుతున్నాయి. వీటితో ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ స్మార్ట్‌ బాక్స్‌ ద్వారా 350 టీవీ ఛానళ్లను కూడా వీక్షించొచ్చు. ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఉంది. డేటా స్పీడ్‌ను బట్టి 40 ఎంబీపీఎస్‌ నుంచి 1 జీబీపీఎస్‌ వరకు మొత్తం ఆరు ప్లాన్లు ఉన్నాయి. వీటిలో అత్యంత ఖరీదైనది రూ.3,999 ప్లాన్‌.

  • విదేశాలకు ప్రయాణించే వారి కోసం ఎయిర్‌టెల్‌ కొత్త ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇవి ఇన్‌-ఫ్లైట్‌ కనెక్టివిటీతో రూ.133 నుంచి ప్రారంభమవుతున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని