Airtel 5G: ఎయిర్‌టెల్‌ మైలురాయి.. 500 నగరాలకు 5జీ సేవల విస్తరణ

Airtel 5g: ఎయిర్‌టెల్‌ తన 5జీ సేవలను మరిన్ని నగరాలకు విస్తరించింది. తాజాగా మరో 235 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించడం ద్వారా 500 నగరాల మైలురాయిని అందుకుంది. 

Published : 24 Mar 2023 16:55 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) తన 5జీ సేవలను వేగంగా విస్తరిస్తోంది. ఈ విషయంలో రిలయన్స్‌ జియోతో పోటీపడుతున్న ఆ సంస్థ.. తాజాగా మరో 235 నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో 500 నగరాలు/ పట్టణాల్లో తమ 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చినట్లయ్యిందని ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు జియో సైతం ఇప్పటికే 406 నగరాలు/ పట్టణాలకు తన సేవలను విస్తరించింది.

‘భారతీ ఎయిర్‌టెల్‌ 235 నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ సేవలను అందుబాటులోకి తెచ్చాం. దీంతో 500 నగరాల్లోని మా వినియోగదారులకు 5వ జనరేషన్‌ నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2022 అక్టోబర్‌లో మొదటగా 5జీ సర్వీసులను ప్రవేశపెట్టాం. ప్రతి ఎయిర్‌టెల్‌ వినియోగదారునికి 5జీ సేవలు అందుబాటులో తీసుకురావటమే లక్ష్యంగా రోజుకు 30-40 నగరాలకు సేవలను విస్తరిస్తున్నాం. 2023 సెప్టెంబర్‌ నాటికి దేశంలోని నగరాలన్నింటికీ ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నాం’ అని భారతీ ఎయిర్‌టెల్‌ సీటీఓ రణదీప్‌ సెఖోన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు