Airtel: ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు అమెజాన్ ప్రైమ్ ప్లాన్స్‌ ఇవే!

Airtel: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కంటెంట్‌ కోరుకునే వారి కోసం భారతీ ఎయిర్‌టెల్‌ రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందిస్తోంది. వాటిలోని ప్రయోజనాలేంటో చూద్దాం..!

Updated : 19 Feb 2024 11:19 IST

Airtel Prepaid Plans | ఓటీటీలకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందుకు అనుగుణంగా రూపొందిస్తున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వీడియో కంటెంట్‌ కోరుకునే వారి కోసం భారతీ ఎయిర్‌టెల్‌ రెండు పథకాలను అందిస్తోంది. వీటితో నచ్చిన సినిమాలు, టీవీ షోలు చూడొచ్చు. పైగా అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది. ఇవి కొత్తవి కాకపోయినప్పటికీ.. అవి అందిస్తున్న ప్రయోజనాల దృష్ట్యా వాటిపై ఓ లుక్కేద్దాం..!

రూ.699 ప్రీపెయిడ్‌ ప్లాన్‌..

భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel) యూజర్లు రూ.699తో రీఛార్జ్ చేస్తే అపరిమిత వాయిస్‌ కాలింగ్‌; రోజుకు 3జీబీ డేటా, 100 ఎసెమ్మెస్‌లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 56 రోజులు. ఈ ప్లాన్‌లో భాగంగా 56 రోజుల కాలపరిమితితో అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌, అపరిమిత 5జీ డేటా, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌ సభ్యత్వం వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి.

రూ.999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ కోరుకునే భారతీ ఎయిర్‌టెల్‌ యూజర్ల కోసం ఉన్న మరో ప్లాన్‌ రూ.999. దీంట్లో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌; రోజుకు 2.5జీబీ డేటా, 100 ఎసెమ్మెస్‌లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 84 రోజులు. అంతే కాలపరిమితితో అమెజాన్‌ ప్రైమ్‌ కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే, రివార్డ్స్‌ మినీ సబ్‌స్క్రిప్షన్‌, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌ వంటి ప్రయోజనాలూ అందుతాయి.

అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) కావాలనుకునే ఎయిర్‌టెల్‌ యూజర్లకు మరిన్ని ప్లాన్లు కూడా ఉన్నాయి. కానీ, అవన్నీ పోస్ట్‌పెయిడ్‌ కేటగిరీ వారికి మాత్రమే వర్తిస్తాయి. రూ.499 నుంచి రూ.1,199 వరకు అన్ని పోస్ట్‌పెయిడ్‌ పథకాల్లో అపరిమిత 5జీ డేటా, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని