airtel: ఎయిర్‌టెల్‌ కొత్త రోమింగ్ ప్యాక్స్‌.. 184 దేశాలకు ఒకే ప్యాక్

ఎయిర్‌టెల్‌ కొత్త అంతర్జాతీయ రోమింగ్‌ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

Published : 24 Apr 2024 13:47 IST

Airtel | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Airtel) కొత్త అంతర్జాతీయ రోమింగ్‌ ప్యాక్స్‌ను తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచే ఈ కొత్త ప్యాక్స్‌ లభిస్తాయని, వీటితో 184 దేశాల్లో కవరేజీ పొందొచ్చని కంపెనీ తెలిపింది. అధిక డేటా ప్రయోజనాలు, ఇన్‌ఫ్లైట్‌ కనెక్టివిటీ, 24/7 కస్టమర్‌ సపోర్ట్‌తో వీటిని తీసుకొచ్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 30 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న రూ.3999 ప్యాక్‌ను లెక్కించి రోజుకు సగటు ధరను ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు గాను 184 దేశాలకు వేర్వేరు ప్యాకేజీలకు సబ్‌స్క్రైబ్‌ అవ్వాల్సిన అవసరం లేకుండా సింగిల్‌ ప్యాక్‌కు సబ్‌స్క్రైబ్‌ అవ్వొచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది. స్థానిక సిమ్‌ కార్డుల కంటే తక్కువ ధరకే ఈ ప్లాన్లు లభిస్తాయని పేర్కొంది. తరచూ ప్రయాణాలు చేసే వారికి ఆటో రెన్యువల్‌ సదుపాయం కూడా ఉందని తెలిపింది. ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే అంతర్జాతీయ రోమింగ్‌ ప్లాన్స్‌ రూ.649 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఒక రోజు వ్యాలిడిటీతో వస్తున్న ఈ ప్యాక్‌ ద్వారా.. 500 ఎంబీ డేటా, 100 నిమిషాల ఫ్రీ ఔట్‌ గోయింగ్ కాల్స్‌ లభిస్తాయి. గరిష్ఠంగా రూ.14,999 వరకు వివిధ రకాల రోమింగ్‌ ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని