Bharti Airtel: రూ.1,000లోపే ఓటీటీ, డీటీహెచ్‌, 3.3TB డేటాతో ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు

Bharti Airtel: క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ తమ యూజర్ల కోసం రూ.1,000లోపు ధరతో నాలుగు ప్లాన్లను అందిస్తోంది. వాటి ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Published : 03 Jun 2024 12:02 IST

Bharti Airtel | ఇంటర్నెట్ డెస్క్‌: భారతీ ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ (Airtel Xstream Fiber) క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. అందుకోసం కంపెనీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. స్థానిక కేబుల్‌ ఆపరేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది. తద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను యూజర్లకు మరింత చేరువ చేసింది. ఈ నేపథ్యంలో ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌లో రూ.1,000లోపు ప్లాన్ల వివరాలు చూద్దాం..

భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) అందిస్తున్న తక్కువ ధర బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ రూ.499. దీంట్లో 40 Mbps వేగంతో నెలకు 3.3 టీబీ డేటా లభిస్తుంది. వింక్‌ మ్యూజిక్‌, అపోలో 24/7 అదనపు ప్రయోజనాలు. రూ.1000లోపున్న మరో ప్లాన్‌ రూ.699. దీంట్లోనూ 40 Mbps వేగంతో ఇంటర్నెట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. హెచ్‌డీతో కలిపి 350కి పైగా టీవీ ఛానళ్లను వీక్షించొచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ సహా 20కి పైగా ఓటీటీలను ఎంజాయ్‌ చేయొచ్చు.

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌లో (Airtel Xstream Fiber) రూ.799తోనూ ఓ ప్లాన్ అందుబాటులో ఉంది. దీంట్లో ఇంటర్నెట్‌ వేగం 100 Mbps. నెలకు 3.3 టీబీ డేటా లభిస్తుంది. వింక్ మ్యూజిక్‌, ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ అదనపు ప్రయోజనాలు. వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు కావాలంటే రూ.899 ప్లాన్‌ను పరిశీలించొచ్చు. దీంట్లో డిస్నీ+ హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ సహా 20కి పైగా ఓటీటీలు ఉంటాయి. డీటీహెచ్‌లో భాగంగా హెచ్‌డీతో కలిపి 350కి పైగా ఛానళ్లను వీక్షించొచ్చు.

వీటిన్నింటినీ ఆరు లేదా 12 నెలల వ్యాలిడిటీతో ఒకేసారి తీసుకుంటే వైఫై రూటర్‌, ఇన్‌స్టలేషన్‌ ఉచితంగా అందిస్తారు. అలాగే అన్ని ప్లాన్లలో ఫిక్స్‌డ్‌లైన్ వాయిస్‌ కాలింగ్‌ కనెక్షన్‌ ఉచితం. ల్యాండ్‌లైన్‌కు సంబంధించిన పరికరాలను మాత్రం సొంతంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు