అమెజాన్‌-ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? ఈ రివార్డులు ఉండవిక..

అమెజాన్‌పే- ఐసీఐసీఐ కో బ్రాండ్‌ క్రెడిట్‌ కార్డ్‌ వాడుతున్నారా? అయితే జూన్‌ 18 నుంచి రివార్డు పాయింట్లలో కొన్ని మార్పులు రానున్నాయి.

Published : 21 May 2024 18:13 IST

Amazon Pay-ICICI Credit Card | ఇంటర్నెట్‌డెస్క్‌: అమెజాన్‌పే- ఐసీఐసీఐ బ్యాంక్‌ కో బ్రాండ్‌ క్రెడిట్‌ కార్డ్‌ వాడుతున్నారా? అయితే మీకో బ్యాడ్‌ న్యూస్‌. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల్లో బ్యాంక్‌ కొంత కోత పెట్టింది. సాధారణంగా క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చేసే వివిధ రకాల లావాదేవీలపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్లను ఐసీఐసీఐ అందిస్తోంది. ఇన్నాళ్లు అద్దె చెల్లింపులపై కూడా 1 శాతం రివార్డు పాయింట్లు ఇస్తోంది. ఇకపై ఈ రివార్డు పాయింట్లు ఉండవని బ్యాంక్‌ తెలిపింది. జూన్‌ 18 నుంచి ఇది అమల్లోకి రానుందని తెలిపింది. ఇప్పటికే యూజర్లకు సందేశాలు పంపుతోంది.

రీకాల్‌, కోక్రియేట్‌ ఫీచర్లతో ఏఐ తరం కోసం మైక్రోసాఫ్ట్‌ కోపైలట్‌+ పీసీలు

ఇక ఈ క్రెడిట్ కార్డు విషయానికొస్తే.. జాయినింగ్‌ ఫీజు, ఎలాంటి వార్షిక రుసుమూ లేకుండానే ఐసీఐసీఐ బ్యాంక్‌-అమెజాన్‌ కో బ్రాండ్‌ క్రెడిట్‌ కార్డును జారీ చేస్తోంది. ఈ కార్డుతో అమెజాన్‌ కొనుగోళ్లపై ప్రైమ్‌ వినియోగదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు అదనపు డిస్కౌంట్లు ఇస్తోంది. ఇంధన సర్‌ఛార్జ్‌ చెల్లింపులపై 1 శాతం రాయితీ అందిస్తోంది. ఈఎంఐ లావాదేవీలు (EMI), బంగారం కొనుగోళ్లపై మాత్రం రివార్డు పాయింట్లు ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని