Steve Jobs: మీటింగ్‌లో నోట్స్‌ రాయడం స్టీవ్‌ జాబ్స్‌కు నచ్చదట.. ఎందుకో తెలుసా?

Steve Jobs: యాపిల్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్‌ జాబ్స్‌ గురించి ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఫిల్‌ షిల్లర్‌ ఓ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు.

Published : 17 Apr 2024 16:01 IST

Steve Jobs | ఇంటర్నెట్‌డెస్క్‌: మీటింగ్‌ సమయంలో చర్చకు వచ్చే ముఖ్యమైన అంశాలను పేపర్‌పై నోట్‌ చేసుకోవడం చాలామందికి ఉండే అలవాటు. ఏ విషయాన్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ప్రతీది నోట్‌ చేసుకొనే వారూ ఉంటారు. ఇదొక మంచి అలవాటని చాలామంది భావిస్తారు. కాని, దీనికి యాపిల్‌ (Apple) సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ (Steve Jobs) పూర్తి వ్యతిరేకమట. మీటింగ్‌ సమయంలో నోట్స్‌ రాసుకోవడం ఆయనకు అసలు నచ్చదట.

యాపిల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫిల్‌ షిల్లర్‌ ‘ది ఆస్ట్రేలియన్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టీవ్‌ గురించి ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. ‘‘1997లో స్టీవ్‌ జాబ్స్‌ తిరిగి వచ్చినప్పుడు సమావేశాల్ని ఏర్పాటుచేశారు. మీటింగ్‌ సమయంలో ఎవరో నోట్స్‌ రాసుకుంటుండటం ఆయన గమనించారు. ‘ఎందుకు రాసుకుంటున్నారు? గుర్తుంచుకునేందుకు ప్రయత్నించాలి’ అని చెప్పారు. అంతే వెంటనే సమావేశంలోని వారంతా నోట్‌ చేసుకోవడం మానేసి శ్రద్ధగా వినడం ప్రారంభించారు’’ అని షిల్లర్‌ అన్నారు. మీటింగ్‌ సమయంలోని ప్రతీ అంశాన్ని గుర్తుంచుకోవాలని జాబ్స్‌ చెబుతుంటారని తెలిపారు.

యంగ్‌ ఇండియాది విరాట్‌ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్‌ రాజన్‌

అమెరికన్‌ రచయిత వాల్టర్‌ ఐజాక్సన్‌ కూడా స్టీవ్‌ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఓసారి ప్యానెల్‌లో మాట్లాడాలని స్టీవ్‌ని పిలిచారంట. అయితే ఆయన దానిని నిరాకరించి నడుస్తూ మాట్లాడుకుందామని సూచించారట. నడుస్తూ సంభాషించడానికే ఆయన ఇష్టపడతారని రచయితకు అప్పుడే అర్థమైంది. ఏదైనా ముఖ్యమైన విషయానికి సంబంధించి చర్చించేటప్పుడు నడుస్తూనే సహోద్యోగులతో చర్చలు జరిపేవారని తెలిపారు. స్టీవ్‌ ఒక్కరే కాదు.. ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే కూడా ఆరుబయట సమావేశాలనే ఇష్టపడతారట. స్నేహితులతో ఉన్నప్పుడు అలా నడుచుకుంటూ మాట్లాడటానికే ప్రాధాన్యం ఇస్తానంటూ గతంలో ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని