Apple Festive Offers: యాపిల్‌ ఫెస్టివ్‌ సేల్‌ ప్రారంభం.. రూ.10 వేల వరకు రాయితీ

Apple Festive Offers: పండగ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో యాపిల్‌ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై రూ.10 వేల వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది.

Published : 16 Oct 2023 15:03 IST

Apple Festive Offers | ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ ఫెస్టివ్‌ సీజన్‌ సేల్‌ (Apple Festive Sale) ప్రారంభమైంది. ఐఫోన్‌, మ్యాక్‌బుక్‌ సహా పలు ఉత్పత్తులు రాయితీ ధరకు లభిస్తున్నాయి. గరిష్ఠంగా రూ.10 వేల వరకు తక్షణ డిస్కౌంట్లు ఉన్నాయి. అదనంగా ఎక్స్ఛేంజ్‌ రాయితీలనూ పొందొచ్చు. అయితే, ఈ రాయితీలు పొందాలంటే కచ్చితంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

వివిధ యాపిల్‌ ఉత్పత్తులపై రాయితీల వివరాలు..

ఐఫోన్లపై (iPhones)..

  • ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌- రూ.6,000
  • ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌- రూ.5,000
  • ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌- రూ.4,000
  • ఐఫోన్‌ 13- రూ.3,000
  • ఐఫోన్‌ ఎస్‌ఈ- రూ.2,000

* ఎంపిక చేసిన ఫోన్లపై రూ.67,800 వరకు ఎక్స్ఛేంజ్‌ రాయితీ కూడా ఉంది.

* కొత్త ఐఫోన్‌ కొనుగోలు చేసినవారు ఆరు నెలల యాపిల్‌ మ్యూజిక్‌ ఉచితంగా పొందొచ్చు. మూడు నెలల యాపిల్‌ టీవీ ప్లస్‌, యాపిల్‌ ఆర్కేడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం.

మ్యాక్‌బుక్‌పై (MacBook)..

  • మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ (M2 chip) 13 అంగుళాలు, 15 అంగుళాలు- రూ.10,000
  • మ్యాక్‌బుక్‌ ప్రో 13 అంగుళాలు, 14 అంగుళాలు, 16 అంగుళాలు- రూ.10,000
  • మ్యాక్‌ స్టూడియో- రూ.10,000
  • మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ (M1 chip)- రూ.8,000
  • ఐమ్యాక్‌ 24 అంగుళాలు- రూ.5,000
  • మ్యాక్‌ మినీ- రూ.5,000

ఎంపిక చేసిన మ్యాక్‌బుక్‌లను ఎక్స్ఛేంజ్‌ చేసుకొని కొత్త మ్యాక్‌పై రాయితీ పొందొచ్చు.

మూడు నెలల యాపిల్‌ టీవీ ప్లస్‌, యాపిల్‌ ఆర్కేడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం.

ఐప్యాడ్‌పై (iPad)..

  • ఐప్యాడ్‌ ప్రో 11 అంగుళాలు, 12.9 అంగుళాలు- రూ.5,000
  • ఐప్యాడ్‌ ఎయిర్‌- రూ.5,000
  • ఐప్యాడ్‌ (10th జనరేషన్‌)- రూ.4,000
  • ఐప్యాడ్‌ (9th జనరేషన్‌)- రూ.3,000
  • ఐప్యాడ్‌ మినీ- రూ.3,000

ప్రస్తుతం ఉన్న ఐప్యాడ్‌ను ఎక్స్ఛేంజ్‌ కింద ఇచ్చేసి కొత్త దానిపై రాయితీ పొందొచ్చు.
మూడు నెలల యాపిల్‌ టీవీ ప్లస్‌, యాపిల్‌ ఆర్కేడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం

యాపిల్‌ వాచ్‌పై (Apple Watch)..

  • యాపిల్‌ వాచ్‌ అల్ట్రా 2- రూ.5,000
  • యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9- రూ.4,000
  • యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ- రూ.2,000

హోమ్‌పాడ్‌పై (HomePod)..

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి హోమ్‌పాడ్‌ను కొనుగోలు చేస్తే రూ.2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఆరు నెలల యాపిల్‌ మ్యూజిక్‌ సభ్యత్వాన్ని ఉచితంగా పొందొచ్చు.

ఎయిర్‌పాడ్స్‌ ప్రో (AirPods Pro)..

  • ఎయిర్‌పాడ్స్‌ ప్రోపై రూ.2,000 తక్షణ డిస్కౌంట్‌ లభిస్తోంది. వీటిని కొనుగోలు చేసిన వారు ఆరు నెలల యాపిల్‌ మ్యూజిక్‌ సభత్వాన్ని ఉచితంగా పొందొచ్చు.

పై ఉత్పత్తులన్నింటిపై మూడు, ఆరు నెలల నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు