‘పీఎల్‌ఐ’ జోరు.. 11 నెలల్లోనే రూ.లక్ష కోట్ల ఐఫోన్‌లు ఉత్పత్తి

11 నెలల్లోనే యాపిల్ కంపెనీ రూ.లక్ష కోట్లు విలువైన ఐఫోన్‌లను ఉత్పత్తి చేసిందని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు.

Updated : 22 Mar 2024 20:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయంగా తయారీ రంగాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు అమలుచేస్తున్న ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకం’ గణనీయ ఫలితాలు అందిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) తెలిపారు. ఉత్పత్తి, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో ఈ పథకం సరికొత్త శిఖరాలను తాకుతోందన్నారు. దీనికింద 2023-24 ఆర్థిక సంవత్సరంలోని 11 నెలల్లోనే యాపిల్‌ సంస్థ రూ.లక్ష కోట్ల విలువైన ఐఫోన్‌లను ఉత్పత్తి చేసిందని వెల్లడించారు.

ఫాక్స్‌కాన్‌, పెగాట్రాన్‌, విస్ట్రాన్‌ వంటి కంపెనీల రాకతో భారీ సంఖ్యలో ఉద్యోగాలు లభించాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఉత్పత్తుల్లో మూడింట రెండో వంతు భారత్‌ నుంచి ఎగుమతి అవుతాయని తెలిపారు. త్వరలో కేరళ రాజధాని తిరువనంతపురంలో పరిశ్రమలను ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తన అధికారిక ‘‘ఎక్స్‌’’ ఖాతాలో పేర్కొన్నారు. 

రెండు నెలల్లో మార్కెట్‌లోకి తొలి CNG బైక్‌: రాజీవ్‌ బజాజ్‌

ఇండియా సెల్యులార్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) వివరాల ప్రకారం దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2014-15లో రూ.18,900 కోట్లుగా ఉన్న ఉత్పత్తి విలువ.. 2024 ఆర్థిక సంవత్సరానికి 20 రెట్లు పెరిగి రూ.4.10 లక్షల కోట్లకు చేరుకుంది. గత పదేళ్లలో 245 కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు ఉత్పత్తి అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని