Asus: 90Whr బ్యాటరీతో ఆసుస్‌ కొత్త గేమింగ్‌ ల్యాప్‌టాప్‌.. ధర, ఫీచర్లివే

Asus: ఆర్‌ఓజీ జెఫిరస్‌ జీ16 (2024) ల్యాప్‌టాప్‌ను ఆసుస్‌ విడుదల చేసింది. ఆర్‌ఓజీ స్ట్రిక్స్‌ స్కార్‌ 16, స్కార్‌ 18లను అప్‌గ్రేడ్‌ చేసింది.

Published : 15 Feb 2024 12:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసుస్‌ తమ గేమింగ్‌ ల్యాప్‌టాప్ ఆర్‌ఓజీ జెఫిరస్‌ జీ16 (Asus ROG Zephyrus G16) (2024) కొత్త వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది. 2.5కే రిజల్యూషన్‌తో కూడిన ఆరు అంగుళాల తెర, 90Whr బ్యాటరీ వంటి ఫీచర్లతో తీసుకొచ్చారు. దీనితో పాటు ఆర్‌ఓజీ స్ట్రిక్స్‌ స్కార్‌ 16, ఆర్‌ఓజీ స్ట్రిక్స్‌ స్కార్‌ 18 ల్యాప్‌టాప్‌లను 13వ తరం ఇంటెల్‌ కోర్‌ ఐ9 సిరీస్‌ ప్రాసెసర్లు, ఎన్విడియా ఆర్‌టీఎక్స్‌ 4000 సిరీస్‌ జీపీయూలతో అప్‌గ్రేడ్‌ చేశారు.

ఆసుస్‌ ఆర్‌ఓజీ జెఫిరస్‌ జీ16 (2024) ధర, ఫీచర్లు..

ఈ ల్యాప్‌టాప్‌ ( Asus ROG Zephyrus G16) విండోస్‌ 11 ప్రో ఓఎస్‌తో వస్తోంది. 2.5కే (1,600x2,560 పిక్సెల్స్‌) రిజల్యూషన్‌, 240Hz రిఫ్రెష్‌ రేటుతో కూడిన WQXGA తెరను పొందుపర్చారు. ఎన్విడియాకు చెందిన ఆర్‌టీఎక్స్‌ 4090 జీపీయూతో అనుసంధానించిన ఏఐ ఆధారిత ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 9 ప్రాసెసర్‌ను అమర్చారు. గేమింగ్‌ ఫీచర్ల సామర్థ్యాన్ని విస్తరించేలా జీపీయూను ఎంయూఎక్స్‌ స్విచ్‌ను ఇవ్వడం విశేషం. వాడేటప్పుడు విడుదలయ్యే వేడిని సమర్థంగా నియంత్రించేలా రెండోతరం ఆర్క్‌ ఫ్లో ఫ్యాన్లు, కొత్తగా రూపొందించిన ఎయిర్‌ఔట్‌లెట్లను ఇచ్చారు. 90Whr బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. దీని ప్రారంభ ధర రూ.1,89,990.

ఆర్‌ఓజీ స్ట్రిక్స్‌ స్కార్‌ ల్యాప్‌టాప్‌ల ధర, ఫీచర్లు..

ఆసుస్‌ తమ ఆర్‌ఓజీ స్ట్రిక్స్‌ స్కార్‌ 16 (Asus ROG Strix Scar 16), స్ట్రిక్స్‌ స్కార్‌ 18 ల్యాప్‌టాప్‌లతో పాటు ఆర్‌ఓజీ జీ55 గేమింగ్‌ డెస్క్‌టాప్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. స్ట్రిక్స్‌ స్కార్‌ 16లో 240 రీఫ్రెష్‌ రేటుతో కూడిన 16 అంగుళాలు, స్కార్‌ 18లో 18 అంగుళాల తెరను అమర్చారు. వీటిని సరికొత్త కోర్‌ ఐ9 14900HX ప్రాసెసర్‌తో ఉన్నతీకరించారు. స్కార్‌ 16లో 175W గరిష్ఠ గ్రాఫిక్స్‌ పవర్‌ ఉన్న ఎన్విడియా  GeForce RTX 4090, స్కార్‌ 18 (Asus ROG Strix Scar 18)లో GeForce RTX 4080 జీపీయూను ఇచ్చారు. ఈ రెండింట్లో ఎంయూఎక్స్‌ స్విచ్‌ ఉంది. రెండు ల్యాప్‌టాప్‌ల్లోనూ 64జీబీ ర్యామ్‌, 4టీబీ వరకు స్టోరేజ్‌ ఆప్షన్‌ను ఇచ్చారు. ఆర్‌ఓజీ స్ట్రిక్స్‌ స్కార్‌ 16 ప్రారంభ ధర రూ.2,89,990. ఆర్‌ఓజీ స్ట్రిక్స్‌ స్కార్‌ 18 ప్రారంభ ధర రూ.3,39,990.

ఆసుస్‌ ఆర్‌ఓజీ జీ22 డెస్క్‌టాప్‌ ధర, ఫీచర్లు..

ఆసుస్‌ ఆర్‌ఓజీ జీ22 డెస్క్‌టాప్‌ను (Asus ROG G22 desktop) ఇంటెల్‌ కోర్‌ ఐ7-14700ఎఫ్‌ ప్రాసెసర్‌తో అప్‌గ్రేడ్‌ చేశారు. దీనికి ఎన్విడియా GeForce RTX 4070 జీపీయూను అనుసంధానించారు. 32 జీబీ డీడీఆర్‌5 ర్యామ్‌ను అమర్చారు. ఫ్రంట్‌ ప్యానెల్‌పై RGB లైటింగ్‌ ఇచ్చారు. డాల్బీ అట్మోస్‌, ఏఐ నాయిస్ క్యాన్సిలింగ్‌ టెక్నాలజీతో కూడిన స్పీకర్లను పొందుపర్చారు. దీని ప్రారంభ ధర రూ.2,29,990.

ఈ డివైజ్‌లన్నీ ఆసుస్‌ ఈ-స్టోర్లు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ప్రముఖ ఆఫ్‌లైన్‌ స్టోర్లలో లభిస్తాయి. కొత్త ల్యాప్‌టాప్‌లను ఫిబ్రవరి 20వరకు కంపెనీకి చెందిన ఈ-షాప్‌ లేదా స్టోర్లలో కొనుగోలు చేసిన తొలి 50 మందికి TUF H3 హెడ్‌సెట్‌ను ఉచితంగా అందించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని