Air India: ఎయిరిండియాకు డీజీసీఏ రూ.80 లక్షల జరిమానా

Air India: పౌర విమానయాన నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఎయిరిండియాకు డీజీసీఏ రూ.80 లక్షల జరిమానా విధించింది.

Updated : 22 Mar 2024 21:25 IST

Air India | దిల్లీ: ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) శుక్రవారం పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. పౌర విమానయాన నిబంధనలను (CAR) ఉల్లంఘించిన కారణంగా రూ.80 లక్షలు జరిమానా విధించినట్లు డీజీసీఏ పేర్కొంది. జనవరిలో ఎయిర్‌లైన్స్‌లో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

రెండు నెలల్లో మార్కెట్‌లోకి తొలి CNG బైక్‌: రాజీవ్‌ బజాజ్‌

ఎయిరిండియా సంస్థ 60 ఏళ్లు పైబడిన సిబ్బందికి కూడా కొన్ని సందర్భాల్లో విధులు అప్పగించిందని.. ఇది సీఏఆర్‌ నిబంధనలకు విరుద్ధం అని డీజీసీఏ తెలిపింది. ఆపరేటర్లకు వారాంతపు విశ్రాంతి కోసం తగినంత సమయం ఇవ్వడం లేదని, అల్ట్రా-లాంగ్ రేంజ్ విమానాలు నడిపే ముందు, తర్వాత సిబ్బందికి విశ్రాంతిని అందించే నిబంధనల్ని ఎయిరిండియా ఉల్లంఘించిందని పేర్కొంది. వీటితో పాటు శిక్షణ రికార్డులను తప్పుగా నమోదు చేసిన సందర్భాలు గుర్తించామని డీజీసీఏ తెలిపింది. దీనిపై మార్చి1న సంస్థకు నోటీసు జారీ చేశామని, ఆ సంస్థ ఇచ్చిన సమాధానం తర్వాత రూ.80లక్షలు జరిమానా విధించినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని