Bajaj Auto: అదరగొట్టిన బజాజ్‌ ఆటో .. లాభం 42శాతం జంప్‌

Bajaj Auto Q1 Results: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ బజాజ్‌ ఆటో మొదటి త్రైమాసిక ఫలితాల్లో రూ.1,665 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

Published : 25 Jul 2023 16:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ బజాజ్‌ ఆటో (Bajaj Auto) మొదటి త్రైమాసిక (Q1 Results) ఫలితాలను  మంగళవారం ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో రూ.1,665 కోట్ల లాభాన్ని (PAT) నమోదు చేసుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదుచేసుకున్న రూ.1,173.30 కోట్లతో పోలిస్తే ఇది 42శాతం అధికం. విదేశీ మార్కెట్‌లో కొనసాగుతున్న సవాళ్ల నడుమ గత త్రైమాసికంలో పోలిస్తే ఎగుమతుల్లో 12శాతం వృద్ధి నమోదయినట్లు కంపెనీ తెలిపింది.

గోవాలో ఉబర్‌కు షాక్‌.. ప్రభుత్వం పోలీస్‌ కేసు

ఇక ఆదాయం విషయానికొస్తే.. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.10,310 కోట్ల ఆదాయం నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.8,005 కోట్ల ఆదాయంతో పోలిస్తే 29శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వాహన విక్రయాలు 10శాతం పెరిగాయని బాజాజ్‌ ఆటో తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 9,33,646 యూనిట్లు విక్రయించగా ఈ ఏడాదిలో 10,27,407 యూనిట్లకు చేరిందని పేర్కొంది. ఇందులో ద్విచక్ర వాహన విక్రయాలు 5శాతం పెరిగి 8,89,330 యూనిట్లకు చేరాయి. దేశీయ అమ్మకాలు 82శాతం పెరిగి 6,41,556 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 5,80,810 యూనిట్లగా ఉన్న ఎగుమతులు 34శాతం తగ్గి 3,85,851 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు విలువ 0.88శాతం క్షీణించి రూ.4,840 వద్ద స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు