Uber Cabs: గోవాలో ఉబర్‌కు షాక్‌.. ప్రభుత్వం పోలీస్‌ కేసు

Goa- Uber: గోవాలో అనుమతి లేకుండా సర్వీసులు నడుపుతున్న ఉబర్‌పై చర్యలు తీసుకోవాలంటూ అక్కడి ప్రభుత్వం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated : 25 Jul 2023 15:24 IST

పనజీ: క్యాబ్‌ సర్వీసులు అందించే ఉబర్‌కు (Uber) గోవాలో (Goa) ఎదురుదెబ్బ తగిలింది. ఉబర్‌ ఇండియా సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వం పోలీస్‌ కేసు పెట్టింది. అక్రమంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొంది. ముందస్తుగా ఎలాంటి అనుమతులూ తీసుకోలేదని తెలిపింది. కొద్ది రోజుల క్రితమే గోవాలో ఉబర్‌ తన క్యాబ్‌ సర్వీసులను ప్రారంభించడం గమనార్హం.

IRCTCలో సాంకేతిక సమస్య.. 4 గంటల తర్వాత అందుబాటులోకి

గోవాలో వాహనాలు నడిపేందుకు ముందస్తుగా ఉబర్‌ తమ వద్ద నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదని అక్కడి రవాణా శాఖ మంత్రి మౌవిన్ గోడిన్హో మీడియాకు తెలిపారు. ట్యాక్సీ అగ్రిగేటర్‌పై చర్యలు కోరుతూ గతవారమే సైబర్‌ సెల్‌కు ఇ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశామని, తాజాగా సైబర్‌ క్రైమ్‌ సెల్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఓలా, ఉబర్‌ వంటి యాప్ ఆధారిత ట్యాక్సీ అగ్రిగేటర్లను గోవాలో అనుమతించబోమని ఇది వరకే ప్రభుత్వం వెల్లడించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం తరఫున రవాణా శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్కో వాజ్‌, ఉబర్‌పై ఈ ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని