Bharti Airtel: భారతీ ఎయిర్‌టెల్‌ లాభం రూ.1,341 కోట్లు

Bharti Airtel Q2 results: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. ఏకీకృత నికర లాభంలో 37.5 శాతం క్షీణతను నమోదు చేసుకుంది.

Updated : 31 Oct 2023 19:55 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) రెండో త్రైమాసిక ఫలితాలను (Q2 results) మంగళవారం ప్రకటించింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 37.5 శాతం తగ్గి రూ.1,341 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.2,145 కోట్లుగా టెలికాం సంస్థ నివేదించింది.  ఆదాయంలో మాత్రం 7.3 శాతం వృద్ధితో రూ.37,044 కోట్లుగా నమోదు చేసింది.

వాట్సప్‌లో భద్రతాపరమైన ఫీచర్‌.. ఆ వివరాలు ట్రాక్‌ చేయలేరు!

‘సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఆదాయంలో మెరుగైన వృద్ధిని నమోదు చేసుకున్నాం. నైజీరియా కరెన్సీ నైరా విలువ తగ్గింపు మా లాభంపై ప్రభావం చూపింది’ అని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ గోపాల్ విట్టల్ తెలిపారు. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కొత్తగా 7.7 మిలియన్ల 4జీ/5జీ నెట్‌ సబ్‌స్క్రైబర్లు పెరిగినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. టెలికాం కంపెనీలు కీలక కొలమానంగా భావించే.. ARPU (వ్యక్తి నుంచి వచ్చే సగటు ఆదాయం) రూ.203 కు చేరినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో మార్కెట్‌ ముగిసే సమయానికి కంపెనీ షేరు విలువ 1.32శాతం క్షీణించి రూ.914.05 వద్ద స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని