వాట్సప్‌లో భద్రతాపరమైన ఫీచర్‌.. ఆ వివరాలు ట్రాక్‌ చేయలేరు!

Whatsapp: వాట్సప్‌లో భద్రతాపరంగా కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. కాల్స్‌ సమయంలో ఐపీ అడ్రస్, లొకేషన్‌ వివరాలను తెలియనివ్వకుండా దీంతో అడ్డుకోవచ్చు.

Published : 31 Oct 2023 18:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త సదుపాయాలను అందించడంతో పాటు భద్రతాపరమైన ఫీచర్లపైనా దృష్టి సారించింది. గుర్తు తెలీని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను రింగ్‌ అవ్వకుండా సైలెన్స్‌ చేసుకునే సదుపాయాన్ని ఆ మధ్య తీసుకొచ్చిన వాట్సప్‌.. ఇప్పుడు ఐపీ అడ్రస్‌ను, లొకేషన్‌ను ప్రొటెక్ట్‌ చేసే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఆడియో, వీడియో కాల్స్‌ సమయంలో లొకేషన్‌, ఐపీ అడ్రస్‌ వివరాలు అవతలి వారికి తెలీకుండా చేయొచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొందరికి అందుబాటులోకి రాగా.. మరికొందరికి ఇంకా అందుబాటులోకి రావల్సి ఉంది. ఈ ఫీచర్‌ యాక్టివేట్‌ చేయాలంటే త్రీడాట్స్‌ మెనూలోని ప్రైవసీలోకి వెళ్లాలి. అక్కడ కనిపించే అడ్వాన్స్‌ సెట్టింగ్స్‌లో ప్రొటక్ట్‌ ఐపీ అడ్రస్‌ ఇన్‌ కాల్స్‌ అనే ఆప్షన్‌ ఎనేబుల్‌ చేసుకోవాలి. అయితే, ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే కాల్‌ క్వాలిటీ కొంత మేర తగ్గుతుందని వాట్సప్‌ చెప్తోంది. ఈ ఫీచర్‌ ఎనేబుల్‌ చేసుకున్నా కాల్స్‌ ఎండ్‌-టు- ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయ్యి ఉంటాయని పేర్కొంది.

5జీ ప్లాన్‌ ధరలు పెరగనున్నాయా? జియో క్లారిటీ

కమ్యూనికేషన్‌కు సంబంధించి ఈ ఫీచర్‌ యూజర్లకు అదనపు భద్రతను అందిస్తుందని వాట్సప్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇచ్చే వాబీటా ఇన్ఫో పేర్కొంది. గుర్తు తెలీని వ్యక్తులతో సంభాషించేటప్పుడు మన ఐపీ అడ్రస్‌, లొకేషన్‌ వంటి వివరాలు తెలీకుండా ఈ ఫీచర్‌ అడ్డుకుంటుందని తెలిపింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. మీకూ ఈ ఫీచర్‌ వచ్చిందేమో చెక్‌ చేయండి. లేదంటే లేటెస్ట్‌ వాట్సప్‌ వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేశాక చెక్‌ చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని