భీమా జువెల్స్‌ ప్రత్యేక ఫెస్ట్‌.. వజ్రాభరణాల కొనుగోలుపై బంగారు నాణేలు (ప్రకటన)

ప్రముఖ గోల్డ్ అండ్‌ డైమండ్ జువెలరీ సంస్థ భీమా జువెల్స్‌ పండగ సందర్భంగా ప్రత్యేక ఫెస్ట్‌ను ప్రకటించింది. డిసెంబర్ 17 నుంచి సంక్రాంతి వరకు ‘డైమండ్స్ ఫ్రమ్ భీమా ఫెస్ట్‌’ను తీసుకొచ్చింది.

Published : 12 Jan 2023 16:46 IST

ప్రముఖ గోల్డ్ అండ్‌ డైమండ్ జువెలరీ సంస్థ భీమా జువెల్స్‌ పండగ సందర్భంగా ప్రత్యేక ఫెస్ట్‌ను ప్రకటించింది. భారత్‌, యూఏఈలో 50కి పైగా స్టోర్లు కలిగిన ఈ సంస్థ డిసెంబర్ 17 నుంచి సంక్రాంతి వరకు ‘డైమండ్స్ ఫ్రమ్ భీమా ఫెస్ట్‌’ను తీసుకొచ్చింది. గడిచిన 98 సంవత్సరాలుగా వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంటున్న ఈ సంస్థ.. ఫెస్ట్‌లో భాగంగా ట్రెండీ, సంప్రదాయ, రోజువారీ, పార్టీవేర్, వజ్రాభరణాలు పొదిగిన జువెలరీని అందుబాటులో ఉంచింది. వీటి ధరలు రూ.5990 నుంచి ప్రారంభమవుతాయి. వజ్రాభరణాల కొనుగోళ్లపై అద్భుతమైన ప్రయోజనాలను కూడా పొందొచ్చని భీమా సంస్థ తెలిపింది. క్యారెట్‌కు రూ.15,000 వరకు తగ్గింపుతో పాటు బంగారు నాణేలు పొందొచ్చని పేర్కొంది. ఈ ఆఫర్‌ కేరళ, కోయంబత్తూర్, మైసూర్, హైదరాబాద్‌లోని తమ స్టోర్లలో వర్తిస్తుందని ఆ సంస్థ తెలిపింది.

ఈ సందర్భంగా భీమా జువెల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ బింధు మాధవ్‌ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా డైమండ్‌ జువెలరీ వృద్ధి చెందుతోందని, పెరుగుతున్న కస్టమర్‌ల డిమాండ్‌కు అనుగుణంగా ఈ కేటగిరీలో పెట్టుబడులు పెడుతూనే ఉన్నామన్నారు. భీమా జువెల్స్‌ డైమండ్ జువెలరీ వద్ద ఎప్పుడూ అద్భుతమైన శ్రేణి ఉంటుందని చెప్పారు. మిలీనీల్స్‌ సహా అన్ని వర్గాలు మెచ్చే కలెక్షన్‌ను అందుబాటులో ఉంచామని తెలిపారు. నాణ్యమైన, అత్యున్నత ప్రమాణాలు కలిగిన జువెలరీని వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇతర రిటైలర్‌ జువెలరీ బ్రాండ్‌లతో పోల్చినప్పుడు భీమా జువెల్స్‌ నిర్వహణపై హామీ, గ్యారెంటీడ్‌ బైబ్యాక్‌, బెస్ట్‌ రీసేల్‌/ ఎక్స్ఛేంజీ విలువ విషయంలో ముందువరుసలో ఉంటుందన్నారు.

భీమా గురించి..

నాణ్యతకు, స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ తొమ్మిది దశాబ్దాలుగా ఈ సంస్థ సాగుతోంది. 1925లో కేరళలోని అలెప్పీలో భీమా భట్టార్‌గా ప్రసిద్ధి చెందిన K. లక్ష్మీనారాయణ భట్టార్‌ ఈ సంస్థను స్థాపించారు. కేరళ రాష్ట్రంలో రిటైల్ దుకాణాన్ని ప్రారంభించిన మొదటి నగల వ్యాపారి కూడా ఆయనే. హాల్‌మార్కింగ్, బార్‌కోడింగ్, ISO సర్టిఫికేషన్‌తో స్వచ్ఛత ప్రమాణాలను అవలంబించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. అనతికాలంలోనే వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొన్నారు. భీమా జువెల్స్‌ ఛైర్మన్‌ బి బిందు మాధవ్ చాలా చిన్న వయసులోనే కుటుంబ వ్యాపారంలో చేరి కేరళలో భీమా సంస్థ వృద్ధికి కృషి చేశారు. భీమా జువెల్స్‌ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ బింధు మాధవ్.. మూడో తరంగా వ్యాపారంలో అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. కేరళ వరకు మాత్రమే పరిమితమైన వ్యాపారాన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు యూఏఈకీ విస్తరించారు. భీమా జువెల్స్‌లో కొత్త టెక్నాలజీని తీసుకురావడంతో పాటు కార్పొరేట్ నిర్మాణాన్ని చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని