Bill Gates: స్ట్రీట్‌ చాయ్‌ను ఆస్వాదించిన బిల్‌గేట్స్‌.. వీడియో వైరల్‌

Bill Gates: భారత్‌ పర్యటనలో ఉన్న బిల్‌ గేట్స్‌ తాజాగా పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 29 Feb 2024 15:58 IST

Bill Gates | ఇంటర్నెట్‌డెస్క్‌: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ (Bill Gates) ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను సందర్శించిన ఆయన.. భారత్‌లోని వివిధ ప్రాంతాలనూ సందర్శిస్తున్నారు. స్థానిక సంస్కృతిని తెలుసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులోభాగంగా సోషల్‌మీడియాలో ఫేమస్‌ అయిన డాలీ చాయ్‌వాలా వద్దకు వెళ్లి చాయ్‌ను టేస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆయనే స్వయంగా పంచుకున్నారు. 

‘భారత్‌లో ఎక్కడ చూసినా ఆవిష్కరణలు కనిపిస్తాయి. సాధారణంగా తయారుచేసే టీలో కూడా’ అంటూ గేట్స్‌ తన వీడియోలో పేర్కొన్నారు. ‘వన్‌ చాయ్‌ ప్లీజ్‌’ అని టీని ఆర్డర్‌ చేయడంతో వీడియో మొదలవుతుంది. డాలీ చాయ్‌వాలా తనదైన శైలిలో బండిమీద టీని సిద్ధం చేస్తుంటే ఆసక్తిగా తిలకించారు. ఆ వ్యక్తి చేసిన టీని తాగుతూ.. మరొకొన్ని ‘‘చాయ్‌ పే చర్చా’’ కోసం ఎదురుచూస్తున్నా అనడంతో వీడియో ముగిసింది.

నా బలం, బలగం వాళ్లే..!: ఆకాశ్‌, ఈశా గురించి అనంత్‌ అంబానీ

డాలీ చాయ్‌వాలా పనితీరును చూసిన బిల్‌గేట్స్‌.. అద్భుతమైన ఆవిష్కర్తలకు భారత్‌ నిలయం అని అభివర్ణించారు. సాధారణంగా కప్పు టీని తయారుచేయడాన్నీ ఓ కళారూపంగా మార్చారన్నారు. గేట్స్‌ పంచుకున్న వీడియో.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతోంది. మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ‘ఇంతకీ బిల్లెంత సర్‌’ అంటూ ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ఇండియా కామెంట్ పెట్టగా.. ‘భూ ప్రపంచంలోనే అదృష్టవంతుడు’ అంటూ డాలీని ఉద్దేశించి ఓ ఫుడ్‌ బ్లాగర్‌ కామెంట్‌ చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని