Anant Ambani: నా బలం, బలగం వాళ్లే..!: ఆకాశ్‌, ఈశా గురించి అనంత్‌ అంబానీ

తన తండ్రి తమతో స్నేహితుడిలా వ్యవహరిస్తారని, తమ తోబుట్టువుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్(Anant Ambani) అన్నారు. 

Updated : 29 Feb 2024 15:15 IST

ముంబయి: తమ ముగ్గురి మధ్య అనిర్వచనీయమైన అనుబంధం ఉందని ఆకాశ్‌(Akash Ambani), ఈశా(Isha Ambani) గురించి అనంత్ అంబానీ(Anant Ambani) వెల్లడించారు. వారెప్పుడూ తనకు అమూల్యమైన సూచనలు ఇస్తూ, తనను ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు.  ప్రీవెడ్డింగ్ వేడుకల వేళ.. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన తోబుట్టువుల గురించి ఈవిధంగా స్పందించారు. 

‘మా ముగ్గురి మధ్య ఎలాంటి పోటీ ఉండదు. ఆకాశ్‌, ఈశా నా మార్గనిర్దేశకులు. నా జీవితాంతం వారి సలహాలు అనుసరించాలని అనుకుంటున్నాను. వారికి నేను హనుమంతుడి లెక్క. నా అన్న నా రాముడు. ఈశా నాకు తల్లితో సమానం. మాది ఫెవిక్విక్‌  బంధం’ అంటూ నవ్వేశారు. 

Anant Ambani: ‘అన్న సేవ’తో అనంత్‌ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలు ప్రారంభం

అలాగే తన తండ్రి ముకేశ్ అంబానీ(Mukesh Ambani) గురించి మాట్లాడుతూ.. ‘ఆయన నాతో ఒక స్నేహితుడిలా మెలుగుతారు. ఎప్పుడూ కఠినంగా వ్యవహరించరు. మాకు ఆయనంటే ఎంతో గౌరవం. నా తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇవన్నీ నిర్మించగలుగుతున్నాను’ అని అన్నారు. అంబానీ కుటుంబంలో జన్మించడం వల్ల తనపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. ‘నేను నా మనసు చెప్పినట్టు చేస్తాను. చివరకు దేవుడు నిర్ణయించిందే జరుగుతుంది. నేను కేవలం నాతండ్రి బాటలో వెళ్తున్నాను. అదే నన్ను ఎదిగేలా చేస్తోంది’ అని సమాధానమిచ్చారు.

‘అందుకే జామ్‌నగర్ ఎంచుకున్నాం’: ప్రీవెడ్డింగ్ వేదికపై అనంత్ స్పందన

అనంత్‌-రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలకు గుర్తుగా ముకేశ్ కుటుంబం బుధవారం రాత్రి ‘అన్నసేవ’ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో అంబానీ, మర్చంట్ కుటుంబాలు పాల్గొన్నాయి. ఇదిలాఉంటే.. ముకేశ్‌-నీతా అంబానీల ముగ్గురు పిల్లలు ఈశా, ఆకాశ్‌, అనంత్..  గత కొన్నేళ్లుగా వీరు రిటైల్, డిజిటల్ సేవలు, నూతన ఇంధనం సహా రిలయన్స్‌ కీలక వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్నారు. అనుబంధ సంస్థల బోర్డుల్లోనూ సేవలందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని