ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% పన్ను.. సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం

Lok Sabha: ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం పన్నుకు సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Updated : 11 Aug 2023 17:03 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో, గుర్రపు పందేలపై (Online Gaming) 28 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్‌ (GST council) ఇటీవల నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ (Nirmala Sitharaman) శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సభలో నిరసనల మధ్యే కేంద్ర వస్తుసేవల పన్ను (సవరణ) బిల్లు 2023, ఇంటిగ్రేటెడ్‌ వస్తుసేవల పన్ను (సవరణ) బిల్లు 2023లకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది.

అప్పుడే ప్రజాస్వామ్యం మెరుగ్గా ఉంటుంది: ఇన్ఫీ నారాయణ మూర్తి

మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇప్పటికే కీలక బిల్లులను ఆమోదించుకున్న కేంద్రం.. వర్షాకాల సమావేశాల చివరి రోజు ఈ సవరణ బిల్లును తీసుకురావటం గమనార్హం. CGST, IGST సవరణ బిల్లులకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆ మేరకు రాష్ట్రాల శాసనసభలు కూడా GST చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని