Narayana Murthy: అప్పుడే ప్రజాస్వామ్యం మెరుగ్గా ఉంటుంది: ఇన్ఫీ నారాయణ మూర్తి

Narayana Murthy: ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కోల్‌కతాలోని టెక్నో ఇండియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.

Updated : 11 Aug 2023 12:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రజాస్వామ్యంపై ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayan Murthy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  దీంతో పాటు జనాభా పెరుగుదల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోల్‌కతా (Kolkata)లోని టెక్నో ఇండియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు.

ప్రతి పౌరుడు తన విశ్వాసాలను పాటించే స్వేచ్ఛను కలిగి ఉండటం.. ఇతరులపై ఆ విశ్వాసాలను రుద్దకుండా ఉండే బహుళత్వ వాతావరణంలో ప్రజాస్వామ్యం ఉత్తమంగా ఉంటుందని నారాయణ మూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డీ రూజ్‌వెల్ట్ చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.‘ నిజమైన ప్రజాస్వామ్యానికి నాలుగు స్వేచ్ఛలు: భావప్రకటనా స్వేచ్ఛ, విశ్వాసాలపై స్వేచ్ఛ, భయం నుంచి స్వేచ్ఛ, కోరిక నుంచి స్వేచ్ఛ’ అని రూజ్‌వెల్డ్‌ చెప్పారని గుర్తుచేశారు.

రెండు రాష్ట్రాల్లో ఆలయాల దర్శనం.. IRCTC ప్యాకేజీ వివరాలివే..

ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి తన అభిప్రాయాన్ని బాధ్యతగా, మర్యాదపూర్వకంగా, నిర్భయంగా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుందన్నారు. అలాగే మెరుగైన జీవితాన్ని కోరుకునే స్వేచ్ఛ కూడా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంలోనే భారతదేశ జనాభా గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జనాభా నియంత్రణకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. జానాభా పెరుగుదల రేటును తగ్గించటం అత్యంత అవసరం అన్నారు. అయితే కొన్ని ప్రాంతాలు జనాభా నియంత్రణలో మంచి పురోగతి సాధించినప్పటికీ.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ అంశం పట్ల శ్రద్ధ వహించడం లేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని