boAt smartwatch: జియో e-సిమ్‌తో బోట్‌ తొలి స్మార్ట్‌వాచ్‌

boAt Lunar Pro LTE: ఇ-సిమ్‌ సపోర్ట్‌తో బోట్‌ తొలి స్మార్ట్‌వాచ్‌ తీసుకొస్తోంది. అంటే కాల్స్‌, మెసేజులు వంటి వాటికి ఇక స్మార్ట్‌ఫోన్‌ అక్కర్లేదు.

Published : 09 Dec 2023 01:51 IST

boAt Lunar Pro LTE | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ వేరెబుల్‌ బ్రాండ్‌ బోట్‌ (boAt).. ఇ-సిమ్‌ సపోర్ట్‌తో కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఇందుకోసం ప్రముఖ టెలికాం కంపెనీ జియోతో జట్టు కట్టింది. లూనార్‌ ప్రో ఎల్‌ఈటీ (boAt Lunar Pro LTE) పేరిట కొత్త స్మార్ట్‌వాచ్‌ను తీసుకొస్తోంది. దేశీయంగా ఇ-సిమ్‌ సపోర్ట్‌తో వస్తున్న తొలి ఇండియన్‌ బ్రాండ్‌ తమదేనని బోట్‌ పేర్కొంది. ఇ-సిమ్‌తో వస్తుండడంతో స్మార్ట్‌ఫోన్‌ లేకున్నా ఈ స్మార్ట్‌వాచ్‌తో కాల్స్‌, మెసేజులు చేసుకోవచ్చు. అంటే బయటకు వెళ్లేటప్పుడు ఇకపై ఫోన్‌ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. 

వాట్సప్‌లో ఇకపై వాయిస్‌ మెసేజ్‌లకు ‘వ్యూ వన్స్‌’.. త్వరలో ఈ ఫీచర్‌ కూడా..

ఇందులో బిల్ట్‌ -ఇన్‌ జీపీఎస్‌ కూడా ఉంటుంది. దీంతో రన్నింగ్, జాగింగ్‌, సైక్లింగ్‌ చేసేటప్పుడు మిమ్మల్ని ట్రాక్‌ చేయొచ్చు. ఇందులో 1.39 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. సన్‌లైట్‌లోనూ డిస్‌ప్లేను చూడొచ్చు. రెగ్యులర్‌ స్మార్ట్‌వాచ్‌లలో ఉన్నట్లే యాక్టివిటీ ట్రాకింగ్, హార్ట్‌రేట్‌ మానిటర్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌ మానిటర్‌, స్లీప్‌ ట్రాకర్‌, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ వంటివి ఉన్నాయి. త్వరలోనే ఈ స్మార్ట్‌వాచ్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఛానెల్స్‌లో విక్రయించనున్నారు. ఎప్పుడు తీసుకొచ్చేదీ, ధరెంత వంటి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని