BoI: రుణ రేట్లు పెంచిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

BoI: ప్రభుత్వ రంగానికి చెందిన రెండు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

Published : 31 Mar 2024 16:24 IST

BoI | దిల్లీ: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BoI) రుణాలపై వడ్డీ రేట్లను సవరించింది. రుణ రేటును 10బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. బీఓఐ నిర్ణయంతో వడ్డీ రేట్లు 2.75 శాతం నుంచి 2.85 శాతానికి చేరాయి. ఏప్రిల్‌ 5న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్యపరపతి విధాన సమీక్ష (MPC) నిర్ణయాలు వెలువడున్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం.

ఎన్‌పీఎస్‌ లాగిన్‌, క్రెడిట్‌ కార్డ్ రూల్స్‌.. ఏప్రిల్‌ 1 నుంచి రాబోతున్న మార్పులివీ..

పెంచిన వడ్డీ రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో ఈ రేట్లతో అనుసంధానం అయిన రుణాలు ప్రియం కానున్నాయి. మరోవైపు.. ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ కూడా వడ్డీ రేట్లను 5 బేసిస్‌ పాయింట్లు పెంచింది. కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్‌ 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుత రెపో రేటు 6.5 శాతం, రెపో ఆధారిత రుణ రేటు (RBLR) 9.35 శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని