BSNL: రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్ల గడువు పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్‌

BSNL: 4జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న తరుణంలో కస్టమర్లను ఆకర్షించడం కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్ల గడువును పెంచింది.

Published : 14 Mar 2024 15:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్కో యూజర్‌పై వచ్చే ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడానికి సాధారణంగా టెలికాం సంస్థలు ప్రీపెయిడ్‌ ప్లాన్ల గడువును కుదిస్తుంటాయి. కానీ, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) సంస్థ అనూహ్యంగా రెండు ప్లాన్ల కాలపరిమితిని ఇటీవల పెంచడం గమనార్హం. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ పథకాలను కంపెనీ సుదీర్ఘకాలంగా తమ కస్టమర్లకు అందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ 4జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎక్కువమంది యూజర్లను ఆకర్షించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.699 ప్లాన్‌ గడువును 130 రోజుల నుంచి 150 రోజులకు పెంచింది. రూ.999 వ్యాలిడిటీని 200 రోజుల నుంచి 215 రోజులుగా చేసింది. ఈమేరకు ఇప్పటికే వెబ్‌సైట్‌, యాప్‌లో మార్పులు చేసింది. రూ.699 ప్లాన్‌లో రోజుకు 0.5జీబీ డేటా, 100 ఎసెమ్మెస్‌లు; అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ వంటి ఫీచర్లు ఉంటాయి. తొలి 60 రోజుల పాటు ‘పర్సనలైజ్డ్‌ రింగ్‌ బ్యాక్‌ టోన్‌ (PRBT)’ కూడా లభిస్తుంది. రూ.999 ప్లాన్‌లో ఎలాంటి డేటా, ఎసెమ్మెస్‌ ప్రయోజనాలు ఉండవు. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రెండు నెలల పాటు పీఆర్‌బీటీ లభిస్తాయి. కొన్ని రోజుల క్రితమే బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.99 ప్లాన్‌ గడువును 18 రోజుల నుంచి 17 రోజులకు కుదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని