BSNL బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లకు OTT సేవలు.. ₹49 నుంచి ప్రారంభం!

BSNL CinemaPlus: ఇప్పటి వరకు యప్‌టీవీ స్కోప్‌ పేరిట బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ తమ యూజర్లకు ఓటీటీ సేవలను అందించింది. తాజగా వాటిని సినిమాప్లస్‌ పేరిట తీసుకొచ్చింది. కొత్తగా మూడు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

Published : 18 May 2023 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) తమ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్ల కోసం కొత్త ఓటీటీ ప్లాన్ల (OTT Plans)ను తీసుకొచ్చింది. సినిమాప్లస్ (BSNL Cinemaplus) పేరిట తీసుకొచ్చిన ఈ ప్లాన్లలో జీ5 ప్రీమియం, సోనీలివ్‌ ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్‌ వంటి ఓటీటీల్లోని కంటెంట్‌ను వీక్షించొచ్చు.

గతంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) యప్‌టీవీ స్కోప్‌ పేరిట ఓటీటీ కంటెంట్‌ను అందిస్తుండేది. దాంట్లో ప్రీమియం ప్యాక్‌ పేరిట రూ.249తో ఒకటే ప్లాన్‌ ఉండేది. కానీ, తాజాగా సినిమాప్లస్‌ (BSNL Cinemaplus) పేరిట తీసుకొచ్చిన ఓటీటీ ప్యాక్‌లో స్టార్టర్‌, ఫుల్‌, ప్రీమియం పేరిట మూడు నెలవారీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ప్లాన్‌ను బట్టి ఓటీటీ వేదికల కాంబినేషన్‌ మారుతూ ఉంటుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ సినిమాప్లస్‌ స్టార్టర్‌ ప్యాక్‌..

ప్రస్తుతం ఈ ప్యాక్‌ రూ.49కే లభిస్తుంది. కానీ, దీని వాస్తవ ధర రూ.99. దీంట్లో షెమరూ, హంగామా, లయన్స్‌గేట్‌, ఎపిక్‌ ఆన్‌ ఓటీటీల్లోని కంటెంట్‌ను వీక్షించొచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ సినిమాప్లస్‌ ఫుల్‌ ప్యాక్‌..

ఈ ఫుల్‌ ప్యాక్‌ ధర రూ.199. దీన్ని సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే నెలరోజుల పాటు జీ5 (ZEE5) ప్రీమియం, సోనీలివ్‌ (SonyLIV) ప్రీమియం, యప్‌టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar)లోని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ సినిమాప్లస్‌ ప్రీమియం ప్యాక్‌..

నెలకు రూ.249 చెల్లించి బీఎస్‌ఎన్‌ఎల్‌ సినిమాప్లస్‌ ప్రీమియం ప్యాక్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. దీంట్లో జీ5 (ZEE5) ప్రీమియం, సోనీలివ్‌ (SonyLIV) ప్రీమియం, యప్‌టీవీ, షెమరూ, హంగామా, లయన్స్‌గేట్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) ఓటీటీలోని కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని