BSNLలో రూ.269 ప్లాన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌, గేమింగ్‌ ప్యాకేజ్‌

BSNL prepaid plans: ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గేమింగ్‌ ప్యాకేజ్‌ కావాలనుకునేవారికి బీఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.269 ప్లాన్‌ మంచి ప్రయోజనాలను అందిస్తోంది.

Published : 10 Apr 2023 15:26 IST

BSNL prepaid plans | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ అధీనంలోని టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ యూజర్ల కోసం అనేక రకాల ప్రీపెయిడ్‌ ప్లాన్ల (BSNL prepaid plans)ను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించారు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, డేటా, ఎంటర్‌టైన్‌మెంట్‌, గేమింగ్‌.. ఇలా అన్నిరకాల యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌లో ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గేమింగ్‌ ప్యాకేజ్‌ కావాలనుకునేవారికి బీఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.269 ప్లాన్‌ మంచి ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వివరాలేంటో చూద్దాం..

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.269 ప్రీపెయిడ్‌ ప్యాక్‌ (BSNL prepaid plans)లో కస్టమర్లకు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు అందుతాయి. అలాగే రోజుకి 2జీబీ డేటా లభిస్తుంది. పరిమితి ముగిసిన తర్వాత వేగం 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. డేటా, వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌లతో పాటు ఈ ప్యాక్‌లో ప్రత్యేకంగా ఎంటర్‌టైన్‌మెంట్‌, గేమింగ్‌ ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోస్‌నౌ, లిజన్‌ పాడ్‌కాస్ట్‌ సర్వీసెస్‌, లోక్‌ధన్‌ కంటెంట్‌, జింగ్‌ మ్యూజిక్‌ వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఉన్నాయి.

ఇక గేమింగ్‌ ప్రయోజనాల విషయానికి వస్తే.. హార్డీ గేమ్స్‌, ఛాలెంజెస్‌ అరీనా మొబైల్‌ గేమింగ్‌ సర్వీస్‌, ఆస్ట్రోసెల్‌, గేమ్‌ఆన్‌, గేమియం వంటివి ఉన్నాయి. వీటన్నింటితో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌ ద్వారా మీకు నచ్చిన పాటను హలోట్యూన్‌గా కూడా పెట్టుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 4జీ సర్వీసులు అందుబాటులో లేవు. అలాంటి ప్రదేశాల్లో 3జీ నెట్‌వర్క్‌లో ఓటీటీ, గేమింగ్‌ ప్రయోజనాల్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌ కాలపరిమితి 28 రోజులు. అంటే రోజుకి దాదాపు రూ.10తో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గేమింగ్‌ను కూడా ఎంజాయ్‌ చేయొచ్చు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని