Byjus: ‘జీతాలు చెల్లించలేకపోతున్నా’.. ఉద్యోగులకు బైజూ రవీంద్రన్‌ లేఖ

Byju Raveendran letter to employees: కొందరు ఇన్వెస్టర్ల కారణంగా జీతాలు సకాలంలో చెల్లించలేకపోతున్నా అంటూ బైజూస్‌ ఉద్యోగులకు సీఈఓ రవీంద్రన్‌ లేఖ రాశారు.

Updated : 02 Mar 2024 18:07 IST

Byju | దిల్లీ: ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ను (Byjus) కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించిన ఆ సంస్థ.. ఉద్యోగులకు మాత్రం సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోంది. ఇన్వెస్టర్లతో నెలకొన్న వివాదం వల్ల వేరే అకౌంట్‌లో నిధులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని బైజూ రవీంద్రన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులకు శనివారం ఆయన లేఖ రాశారు. గత నెలలో తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొన్నామని, ఇప్పుడు నిధులు ఉన్నా సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని రవీంద్రన్‌ తన లేఖలో తెలిపారు. మార్చి 10 కల్లా జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. 

‘దురదృష్టవశాత్తూ కొందరు ఇన్వెస్టర్ల వల్లే ఈ పరిస్థితి నెలకొంది. రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించుకొన్నప్పటికీ.. వారి మూలంగా మీరు పడిన కష్టానికి జీతం చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. కొందరు ఇన్వెస్టర్లు బైజూస్‌లో పెట్టుబడి ద్వారా గణనీయమైన లాభాలు పొందారు. అందులో ఒకరు పెట్టిన పెట్టుబడికి ఏకంగా 8 రెట్లు ఆర్జించారు. అలాంటివారు ఇతరుల జీవితాలు, జీవనోపాధితో ఇప్పుడు ఆటలాడుకుంటున్నారు’’ అని రవీంద్రన్‌ ఆరోపించారు.

ప్రీవెడ్డింగ్‌లో అనంత్‌ మాటలకు.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ అంబానీ

హక్కుల సాధన కోసం తమ న్యాయబృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని రవీంద్రన్‌ పేర్కొన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి మీకు ఆర్థిక సహకారం ఇవ్వలేకపోతున్నా అనేది వాస్తవమన్నారు. ఇటీవల బైజూస్‌ సంస్థ 200 మిలియన్‌ డాలర్ల నిధులను రైట్స్‌ జారీ ద్వారా సమీకరించింది. కొందరు ఇన్వెస్టర్లు బైజూస్‌పై నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో ఆ మొత్తాన్ని ఎస్క్రో అకౌంట్‌లో ఉంచాలని బైజూస్‌కు సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 4కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు