WeChat: చైనాకు షాక్‌.. ప్రభుత్వ పరికరాల్లో వీచాట్‌పై కెనడాలో వేటు..!

చైనా-కెనడా మధ్య వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. చైనాకు చెందిన సూపర్‌ యాప్‌ వీచాట్‌ను ప్రభుత్వ పరికరాల్లో వాడటంపై కెనడా నిషేధం విధించింది. 

Published : 31 Oct 2023 10:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ దేశంలో చైనా సూపర్‌ యాప్‌ వీచాట్‌(WeChat)ను ప్రభుత్వ పరికరాల్లో వాడటాన్ని నిషేధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. ఈ యాప్‌ విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగించే యాప్స్‌లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా దక్షిణాసియా వాసులు దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కెనడా ప్రభుత్వం తెలిపింది.

ఈ యాప్‌ నుంచి కీలకమైన డేటా లీక్‌ అవుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు లభించకపోయినప్పటికీ.. రిస్క్‌ను అంచనావేసి ముందు జాగ్రత్తగా ప్రభుత్వ పరికరాల నుంచి దీనిని తొలగించాలని ఆదేశించినట్లు కెనడా ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలు అనితా ఆనంద్‌ పేర్కొన్నారు. ఈ పరిణామాలపై వీచాట్‌ యజమాని అయిన టెన్సెంట్‌ సంస్థ స్పందించలేదు. మరోవైపు రష్యాకు చెందిన క్యాస్పర్‌స్కీ పై కూడా చర్యలు తీసుకొంటున్నట్లు వెల్లడించారు. 

చమురు ధరలతో యుద్ధమే

గతంలో టిక్‌టాక్‌ యాప్‌పై కూడా ఇలానే భద్రతాపరమైన విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు చాలా మంది సైబర్‌ నిపుణులు వీచాట్‌ నుంచి కూడా తీవ్రమైన ముప్పు పొంచిఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే టిక్‌టాక్‌ అంత విరివిగా దీనిని వాడకపోవడంతో ఎవరి దృష్టి దీనిపై పడలేదు. వాస్తవానికి ట్రంప్‌ హయాంలోనే అమెరికాలో  దీనిని నిషేధించాలని 2020లో ఆదేశాలు జారీ చేశారు. కానీ, కోర్టు ఈ ఆదేశాలను నిలుపుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని