iPhone Users: యాపిల్‌ యూజర్లకు కేంద్రం ‘హై-రిస్క్‌’ అలర్ట్‌..

Apple: యాపిల్ యూజర్లు తమ ఫోన్లను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్‌-ఇన్‌ హెచ్చరించింది. ఈ కంపెనీకి చెందిన ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు తెలిపింది.

Published : 03 Apr 2024 16:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ (Apple) ఉత్పత్తులను వినియోగించే యూజర్లకు కేంద్రం భద్రతాపరమైన హెచ్చరికలు చేసింది. ఐఫోన్‌ (iPhone), మ్యాక్‌బుక్స్‌, ఐప్యాడ్స్‌, విజన్‌ ప్రో హెడ్‌ సెట్లకు ‘హై-రిస్క్‌’ అలర్ట్‌ ఇచ్చింది. ఈ ఉత్పత్తుల్లో ‘రిమోట్‌ కోడ్‌ ఎగ్జిక్యూషన్‌’కు సంబంధించి క్లిష్టమైన సెక్యూరిటీ లోపం ఉన్నట్లు తాము గుర్తించామని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (CERT-In) వెల్లడించింది.

ఈ లోపం వల్ల హ్యాకర్లు ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్‌ చేసి మన డివైజ్‌లను రిమోట్‌గా ఆపరేట్‌ చేసే ముప్పు ఉందని హెచ్చరించింది. అందువల్ల యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్‌ సెక్యూరిటీ వెర్షన్‌తో అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఐఓఎస్‌, ఐప్యాడ్‌ ఓఎస్‌ 17.4.1, 16.7.7 కంటే ముందు వెర్షన్ల, సఫారీ 17.4.1, మ్యాక్‌ఓఎస్‌ వెంట్యురా 13.6.6, మ్యాక్‌ఓఎస్‌ సొనోమా 14.4.1, యాపిల్‌ విజన్‌ ఓఎస్‌ 1.1.1 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్‌-ఇన్‌ వెల్లడించింది.

కేరళ ప్రకృతి అందాలు చూస్తారా? ₹14 వేల నుంచే IRCTC ప్యాకేజీ

17.4.1 కంటే ముందు ఓఎస్‌ను వినియోగించే ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఐప్యాడ్‌ ప్రో 12.9, 10.5, 11 ఇంచ్‌, ఐప్యాడ్‌ ఎయిర్‌, ఐప్యాడ్‌ మినీ యూజర్లకు ఈ ముప్పు ఉంటుందని సెర్ట్‌-ఇన్‌ తమ అడ్వైజరీలో పేర్కొంది. ఇక 16.7.7 వెర్షన్‌ కంటే ముందు ఓఎస్‌లను వినియోగించే ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌, ఐఫోన్‌ ఎక్స్‌, ఐప్యాడ్‌ ఫిఫ్త్‌ జెనరేషన్‌, ఐప్యాడ్‌ ప్రో 9.7 యూజర్లు కూడా హ్యాకింగ్‌ బారిన పడే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ యూజర్లు వెంటనే తమ డివైజ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. గతంలోనూ యూపిల్‌ ఉత్పత్తులపై కేంద్రం ఇలాంటి సెక్యూరిటీ అలర్ట్‌లు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు