Amazon: ఫేక్‌ ఐఫోన్‌ డెలివరీపై కస్టమర్‌ ఆగ్రహం.. స్పందించిన సంస్థ

Amazon: అమెజాన్‌ నుంచి ఐఫోన్‌ ఆర్డర్‌ చేసిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని అతడు ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నాడు.

Updated : 24 Feb 2024 15:34 IST

Amazon | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోళ్లకు సంబంధించిన వార్తలు ఈ మధ్య తరచూ వైరల్‌గా మారుతున్నాయి. ఓ వస్తువు బుక్‌ చేస్తే మరో వస్తువు డెలివరీ కావడం.. లేదా వాడిన వస్తువో, నకిలీదో తెచ్చి ఇవ్వడం వంటి ఘటనలు సోషల్‌మీడియా వేదికగా బయటకొస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి అనుభవమే ఓ వినియోగదారుడికి ఎదురైంది. ఈ విషయాన్ని అతడు ఎక్స్‌ వేదికగా పంచుకున్నాడు.

సోషల్‌మీడియాలో పాపులర్‌ అయిన గబ్బర్‌ సింగ్‌ అనే వ్యక్తి తాజాగా అమెజాన్‌ (Amazon) నుంచి ఐఫోన్‌ 15 (iPhone 15)ను ఆర్డర్‌ చేశాడు. డెలివరీ అందాక అది నకిలీ ఫోన్‌ అని గుర్తించి ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని తన ఫాలోవర్లతో పంచుకున్నాడు. ‘అమెజాన్‌ నాకు నకిలీ ఐఫోన్‌ 15ను డెలివరీ చేసింది. ఇందులో కేబుల్‌ కూడా లేదు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదుర్కొన్నారా?’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేసి, అమెజాన్‌కు ట్యాగ్‌ చేశాడు.

ఇన్‌స్టంట్‌ రుణమా..? ఈ విషయాలు తెలుసుకున్నాకే..!

గబ్బర్‌ చేసిన పోస్ట్‌ అతి తక్కువ సమయంలోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అమెజాన్‌ విషయంలో తమకు ఎదురైన అనుభవాలను నెటిజన్లు కామెంట్ల రూపంలో పంచుకున్నారు. ‘లాప్‌ట్యాప్‌ బుక్‌ చేస్తే వాక్యూమ్‌ క్లీనర్‌ వచ్చింది’ అని ఒకరు.. ‘నోకియా 42 5జీ మొబైల్‌ ఆర్డర్‌ చేస్తే ఛార్జర్‌ లేకుండా డెలివరీ చేశారని ఇంకొకరు పేర్కొన్నారు. అమెజాన్‌ సర్వీసులు బాగాలేవు అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. దీనిపై అమెజాన్‌ స్పందించింది. ‘ఇలా జరిగినందుకు మమ్మల్ని క్షమించండి. ఆర్డర్‌ వివరాలు తెలియజేస్తే 6-12 గంటల్లో మీకు సాయం చేస్తాం’ అంటూ సమాధానం ఇచ్చింది. ఐఫోన్‌ కోసం వెచ్చించిన మొత్తాన్ని పూర్తిగా రిఫండ్‌ చేయాలని గబ్బర్‌ అమెజాన్‌ను కోరాడు. దీంతో తన వద్ద ఐఫోన్‌ తీసుకుని, రిఫండ్‌ను ప్రాసెస్‌ చేసినట్లు ఆ వ్యక్తి మరో పోస్ట్‌లో పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని