Ola: ఇక ఓలా యాప్‌లోనూ యూపీఐ చెల్లింపులు

Ola cabs: ప్రముఖ క్యాబ్‌ బుకింగ్‌ సేవల సంస్థ ఓలా తన యాప్‌లోనే యూపీఐ పేమెంట్స్‌ చేసేలా కొత్త ఫీచర్‌ని యూజర్లకు పరిచయం చేసింది.

Published : 30 Nov 2023 19:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ క్యాబ్ బుకింగ్‌ సేవల సంస్థ ఓలా (Ola) తన యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ని పరిచయం చేసింది. ఇకపై ఓలా యాప్‌లోనే డిజిటల్‌ పేమెంట్‌ చేయవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా ప్రకటించారు.

ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి

సాధారణంగా క్యాబ్‌ బుక్‌ చేసుకోవాలంటే పేమెంట్‌ మోడ్‌లో ఓలా మనీ వాలెట్‌, క్యాష్‌, యూపీఐ లేదా ఇతర పేమెంట్‌ విధానాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఏ ఇతర యూపీఐ యాప్స్‌ సాయం లేకుండా కేవలం ఓలా యాప్‌ ద్వారానే పేమెంట్‌ చేసే సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది. ఇప్పటివరకు క్యాబ్‌ బుకింగ్‌కి మాత్రమే వినియోగించే యాప్‌ ఇకపై యూపీఐ సేవల్ని కూడా అందించనుంది. దీనికోసం యాప్‌లో యూపీఐ పేమెంట్స్‌ ఫీచర్‌ని జత చేసింది. దీంతో యాప్‌ ద్వారానే క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి డబ్బులు చెల్లించవచ్చని పేర్కొంది. ఈ ఫీచర్‌ మొదట బెంగళూరు వాసులకు అందుబాటులో తీసుకురానుందని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ముగిసే నాటికి దేశవ్యాప్తంగా అన్ని నగరాలకు ఈ సేవల్ని విస్తృతం చేయనున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని