Dish tv: టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్‌ ప్లస్‌ను ఆవిష్కరించిన డిష్‌ టీవీ

టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్‌ ప్లస్‌ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్‌-టు-హోమ్‌ సేవలను అందించే డిష్‌ టీవీ ప్రకటించింది.

Updated : 18 May 2024 01:42 IST

డిష్‌ టీవీ స్మార్ట్‌ ప్లస్‌ను ఆవిష్కరిస్తున్న మనోజ్‌ దోభాల్, నటి శ్రద్ధా దాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్‌ ప్లస్‌ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్‌-టు-హోమ్‌ సేవలను అందించే డిష్‌ టీవీ ప్రకటించింది. కొత్తగా అందిస్తున్న  ఈ సేవల్లో టీవీ ఛానళ్లతోపాటు, ‘ఈటీవీ విన్‌’ సహా మొత్తం 21 ఓటీటీలు అందుబాటులో ఉంటాయని డిష్‌ టీవీ సీఈఓ మనోజ్‌ దోభాల్‌ తెలిపారు. ఇందులో 5 ఓటీటీలను ప్యాకేజీలో భాగంగా ఉచితంగా అందిస్తామన్నారు. మిగతా వాటిలో వినియోగదారులు ఏదో ఒక ఓటీటీని ఉచితంగా ఎంచుకోవచ్చని, 3 రోజులకోసారి దాన్ని మార్చుకునే వెసులుబాటూ ఉంటుందని వివరించారు. ప్రాథమిక ప్లాన్‌కు తోడుగా రూ.179 ప్యాకేజీతో మొత్తం ఓటీటీలను చూసేందుకు వీలుంటుందన్నారు. కొత్తగా డిష్‌ టీవీ కనెక్షన్‌ తీసుకునే వారు రూ.3,000 చెల్లిస్తే, వారికి రూ.5,500 విలువైన నగదు వెనక్కి ప్రయోజనాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు