పిక్సెల్‌ ఫోన్లూ ఇక దేశీయంగానే.. డిక్సన్‌తో గూగుల్‌ జట్టు

Google Pixel: గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్లు దేశీయంగా తయారు కానున్నాయి. ఇందుకోసం డిక్సన్‌ను తయారీ భాగస్వామిగా ఎంచుకుంది.

Updated : 22 May 2024 14:18 IST

Google Pixel | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ తయారీ ఊపందుకుంటోంది. ఇప్పటికే యాపిల్‌, శాంసంగ్‌, పలు చైనా కంపెనీలు వీటి తయారీని చేపడుతుండగా.. తాజాగా గూగుల్ కూడా త్వరలో పిక్సెల్‌ ఫోన్ల (Google Pixel) తయారీ ప్రారంభించనుంది. ఇందుకోసం దేశీయ తయారీ భాగస్వామిగా డిక్సన్‌ టెక్నాలజీస్‌ను ఎంచుకుంది. మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి ఈ డీల్‌ మరింత ఊతమివ్వనుంది. 

దేశీయంగా పిక్సెల్‌ ఫోన్ల తయారు చేయనున్నట్లు గూగుల్‌ ఇప్పటికే వెల్లడించింది. గత అక్టోబర్‌లో జరిగిన గూగుల్‌ ఫర్‌ ఇండియా ఈవెంట్‌లో ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 2024లోనే తొలి పిక్సెల్‌ ఫోన్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. నాటి నుంచి భారత్‌లో తయారీ భాగస్వామి కోసం గూగుల్‌ అన్వేషణ చేపట్టింది. చాలా కంపెనీలనూ సంప్రదించినప్పటికీ.. చివరికి వాటిల్లో డిక్సన్‌నే గూగుల్‌ ఫైనల్‌ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై డిక్సన్‌ స్పందించాల్సి ఉంది.

రూ.550 కోట్లకు పెరిగిన పేటీఎం నష్టం

త్వరలోనే పిక్సెల్‌ ఉత్పత్తి ప్రారంభించనున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పిక్సెల్‌ 8తో పాటు మిగిలిన వెర్షన్లను స్థానికంగా తయారు చేయడంతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి చేయనున్నారు. డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇప్పటికే షావోమీ, నోకియా, మోటోరొలా వంటి స్మార్ట్‌ఫోన్లను దేశీయంగా తయారు చేస్తోంది. దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని అందుకోవడంతో పాటు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (PLI స్కీమ్‌) ద్వారా లబ్ధి పొందాలని గూగుల్‌ భావిస్తోంది. ఇందులో భాగంగానే తయారీకి ముందుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని