Layoffs: అమెజాన్‌, మెటా బాటలో ebay.. వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపు

Layoffs: వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈబే ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వెయ్యి మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

Updated : 24 Jan 2024 16:03 IST

Layoffs | ఇంటర్నెట్‌డెస్క్‌: ఇ- కామర్స్‌ సంస్థ ఈబే (ebay) ఉద్యోగులకు ఉద్వాసన (layoffs) పలికింది. తన సంస్థలో పనిచేస్తున్న వారిలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తొలగింపు విషయాన్ని ఇ- మెయిల్‌ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. రానున్న రోజుల్లో మరికొన్ని రౌండ్లలో తొలగింపులు చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది.

‘‘మన వ్యూహాలకు వ్యతిరేక దిశలో కంపెనీ పురోగమిస్తున్నప్పుడు వ్యాపార వృద్ధిని మించి ఉద్యోగులు, ఖర్చులు ఉంటాయి. దీన్ని పరిష్కరించడానికి సంస్థాగత మార్పుల్ని అమలు చేస్తున్నాం. మా కస్టమర్ల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని కంపెనీ ఈసీఓ జామీ ఐయానోన్‌ ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో తెలిపారు.

‘సరసమైన ఇళ్ల’ నిర్వచనంలో మార్పునకు క్రెడాయ్‌ విజ్ఞప్తి

కంపెనీలు తమ శ్రామిక శక్తిని తగ్గించుకోవడానికి ముఖ్య కారణాల్లో ఓవర్‌హైరింగ్‌ కూడా ఒకటి. కొవిడ్ మహమ్మారి విజృంభణ తర్వాత పలు కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. వ్యయాల్ని తగ్గించుకోవడం కోసం 2022 చివరి నుంచి తొలగింపులు మొదలుపెట్టాయి. అప్పటి నుంచి లేఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ ఏడాదిలో కూడా వెయ్యి మందికి పైగా ఉద్యోగులను గూగుల్‌ (Google) తొలగించింది. కంపెనీ కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, అమెజాన్‌ ఎంజీఎం స్టూడియో విభాగాల్లో పనిచేస్తున్న వారిని తొలగిస్తున్నట్లు అమెజాన్‌ (Amazon) ప్రకటించింది. మెటా (Meta), టిక్‌టాక్‌ (TikTok) కంపెనీలు కూడా తమ సంస్థలోని ఉద్యోగులను తొలగించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని