భారత్‌లో 2 లక్షల ఖాతాలపై ‘ఎక్స్‌’ నిషేధం.. కారణమిదే!

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్‌ ‘ఎక్స్‌’.. భారత్‌లో 2లక్షల ఖాతాలపై నిషేధం విధించింది. ఎందుకంటే?

Updated : 14 Apr 2024 19:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నేతృత్వంలోని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్’ పెద్ద సంఖ్యలో భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ నియమాలు 2021 (IT Rules 2021) ఉల్లంఘన కారణంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 మధ్య మొత్తం 2,12,627 ఖాతాలను తొలగించినట్లు పేర్కొంది. వీటిలో చిన్నారులపై లైంగిక వేధింపులను, నగ్న దృశ్యాలు ప్రోత్సహించే ఖాతాలు ఉన్నాయని తెలిపింది. కంపెనీ నెలవారీ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

జీ-మెయిల్‌లో లార్జ్‌ ఫైల్స్‌ను సెండ్‌ చేయడం ఎలా?

‘‘భారత్‌లోని యూజర్ల నుంచి 5,158 ఫిర్యాదులను స్వీకరించాం. వాటిలో 86 ఫిర్యాదుల్ని ప్రాసెస్‌ చేశాం. పరిశీలన అనంతరం వాటిలో 7 అకౌంట్లను రద్దు చేశాం’’ అని ‘ఎక్స్‌’ తెలిపింది. భారత్‌ యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో వేధింపులు (3,074), ద్వేషపూరిత ప్రవర్తన (412), అడల్ట్‌ కంటెంట్ (953) వేధింపులు (359).. వంటి అంశాలకు సంబంధించినవి ఉన్నాయని పేర్కొంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్న 1,235 ఖాతాలను తొలగించినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 25 మధ్య 5,06,173 ఖాతాలను మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ తొలగించిన విషయం తెలిసిందే. వీటిలో 1,982 ఖాతాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని